తమిళ ప్రేక్షకులలో నాని మ్యానియా !
దీనితో ఈ మూవీ పై నాని పెట్టుకున్న అంచనాలు సఫలం కాలేదు. అయితే ఎవరు ఊహించని విధంగా ఈ మూవీ తమిళనాడులో తమిళ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చడంతో ఈమూవీ అక్కడ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈమూవీని పాన్ ఇండియా మూవీగా ప్రమోట్ చేసి ‘సూర్యాస్ సాటర్డే’ పేరుతో విడుదల చేశారు. ఈమూవీని బాలీవుడ్ ప్రేక్షకులు కానీ అదేవిధంగా మళయాళ ప్రేక్షకులు కానీ పెద్దగా పట్టించుకోలేదు.
అయితే కాలీవుడ్ లో మాత్రం ఈమూవీకి సూపర్ హిట్ టాక్ రావడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. వాస్తవానికి ‘ఈగ’ సినిమా నుండి నాని తమిళ ప్రేక్షకులకు బాగా పరిచయం. ఈమూవీలో ఎస్ జె సూర్య విలన్ పాత్ర చేయడం వల్ల కావచ్చు లేదంటే ఈమూవీకి నాని తమిళనాడులో చేసిన ప్రమోషన్ వల్ల కావచ్చు ఈమూవీకి తమిళ ప్రేక్షకులలో మంచి స్పందన వచ్చింది.
దీనికితోడు ఈమూవీ తమిళ మీడియాకు కూడ బాగా నచ్చడంతో అక్కడ రేటింగ్స్ కూడ బాగా వచ్చాయి. ఈసినిమాకు తొలి రోజు నుంచి మంచి వసూళ్లు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘సరిపోదా శనివారం’ ఓవరాల్ కలెక్షన్లలో తెలుగు వెర్షన్ మినహాయిస్తే మేజర్ కంట్రిబ్యూషన్ తమిళ ప్రేక్షకుల నుంచే వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక సినిమా ఎంతో ఎంతో శ్రద్ధ పెట్టి తీసినప్పటికీ ఒక భాషలోని ప్రేక్షకులకు నచ్చడం మరొక భాషలోని ప్రేక్షకులకు నచ్చకపోవడం వెనుక ఉన్న మ్యాజిక్ తలలు పండిన సినీ విశ్లేషకులకు కూడ అంతుచిక్కడం లేడు. ఏది ఎలా ఉన్నా నాని సినిమాలకు తమిళ ప్రేక్షకులలో కూడ క్రేజ్ ఉండటం విశేషం అని అనుకోవాలి..