తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో కొరటాల శివ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాలకు కథలను అందించారు. అలా కథ రచయితగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆయన ఆ తర్వాత మిర్చి మూవీ తో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఈ సినిమా తర్వాత ఈయన దర్శకత్వం వహించిన శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ , భరత్ అనే నేను సినిమాలు వరుసగా బ్లాక్ బాస్టర్ విజయాలను సాధించడంతో కొరటాల టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ల స్థాయికి చేరుకున్నాడు.
ఇక ఆఖరుగా ఈయన ఆచార్య మూవీ కి దర్శకత్వం వహించగా ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయం ఎదుర్కొంది. ప్రస్తుతం కొరటాల , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న దేవర అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుండగా అందులో మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఈ మూవీ తర్వాత కొరటాల ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతుంది. ఇక కొరటాల తన నెక్స్ట్ మూవీ ని తెలుగు హీరోతో కాకుండా మలయాళ హీరోతో చేయబోతున్నట్లు తెలుస్తోంది.
అసలు విషయం లోకి వెళితే ... మలయాళ ఇండస్ట్రీలో స్టార్ నటలలో ఒకరు అయినటువంటి మోహన్ లాల్ కుమారుడు ప్రవీణ్ మోహన్ లాల్ ని రీసెంట్ గా కలిసి కొరటాల ఓ కథను చెప్పినట్లు ఆయనకు కూడా కథ నచ్చడంతో ఆ నటుడితోనే కొరటాల తన నెక్స్ట్ మూవీ ని చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే కొరటాల దర్శకత్వంలో రూపొందిన జనతా గ్యారేజ్ సినిమాలో మోహన్ లాల్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు.