జూనియర్ ఎన్టీఆర్ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ముందుంటారు అని చాలామంది ఆయన అభిమానులు చెబుతూ ఉంటారు.ఎందుకంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా చాలు ఎన్టీఆర్ చెవిన ఆ విషయం పడితే ఆలోచించడం ఉండదు నెక్స్ట్ మినిట్లో వారికి సహాయం అందడమే. ఇప్పటికే ఎంతోమందికి రహస్య దానాలు చేస్తున్న ఎన్టీఆర్ తాజాగా కోటి రూపాయల భారీ విరాళం ప్రకటించి రెండు తెలుగు రాష్ట్రాల అభిమానుల మన్ననలు పొందుతున్నారు. ఇక విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్లలో భారీ వర్షాల కారణంగా ఎంతోమంది ప్రజలు జనజీవనాన్ని కోల్పోయారు.లక్షలాదిమంది ఇండ్లు వరదల్లో మునిగిపోయాయి. ఎంతోమంది తినడానికి తిండి లేక ఎవరు ఆహారం అందిస్తారా అని బిక్కు బిక్కుమంటూ ఆకాశం వైపు ఎదురుచూస్తూ ఉన్నారు. కనీసం నీళ్లు తాగడానికి కూడా లేదు లాలాజలం మిగుకుంటూ తమ పరిస్థితిని వెల్లదీసుకుంటున్నారు. అయితే అలాంటి దుస్థితి ఇప్పటికీ ఎంతో మంది ఎదుర్కొంటున్నారు.
ఇక దీంతో చాలామంది సినీ రాజకీయ సెలబ్రిటీలు,వ్యాపారవేత్తలు తమకు తోచిన సహాయం చేస్తున్నారు. అయితే ఇప్పటికే పలువురు బిజినెస్ మ్యాన్లు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళాలు సీఎం సహాయక నిధికి అందజేస్తున్నారు. ఇందులో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ సైతం తన వంతుగా కోటి రూపాయల భారీ విరాళాన్ని రెండు తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు విరాళంగా ఇస్తున్నట్టు ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షం కారణంగా వచ్చిన వరదల్లో ఇరుక్కున్న ప్రజలను చూస్తే నా హృదయం ఎంతగానో కలిచివేస్తుంది. వర్షం కారణంగా వచ్చిన వరద బీభత్సం చూసి నేను ఎంతగానో చలించి పోయాను.
అందుకే నా వంతుగా రెండు తెలుగు రాష్ట్రాలకు చేరో 50 లక్షల విరాళం అందిస్తున్నాను అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. అలాగే ఈ విపత్తు నుండి తొందరగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు బయటపడాలని ఆ దేవుడిని కోరుకుంటున్నట్టు ఎన్టీఆర్ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఎన్టీఆర్ మంచి మనసుకు ఎంతోమంది అభిమానులు ఆయన్ని పొగుడుతున్నారు. ఇక మరికొంతమందేమో ఎన్టీఆర్ ఈ విరాళం ఇవ్వడానికి కారణం చంద్రబాబు, బాలకృష్ణ మెప్పు పొందడానికి అని అంటూ ఉంటే, మరి కొంత మందేమో మెప్పు కోసం కాదు ప్రజల కోసం ఆయన ఆలోచించారని ఇలా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు