అట్లీ వేటింగ్ అందుకేనా.. అల్లు అర్జున్ తో సినిమా లేనట్లేనా..?

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లలో అట్లీ ఒకరు. ఈయన రాజా రాణి అనే మూవీ తో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఈయన కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ హీరోగా తేరి అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈయన తలపతి విజయ్ హీరోగా మెర్సెల్ , బిగిల్ అనే సినిమాలను రూపొందించాడు. ఈ మూవీలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే ఆఖరుగా అట్లీ బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి షారుక్ ఖాన్ హీరోగా జవాన్ అనే మూవీ ని రూపొందించాడు.

ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. అలాగే ఈ సినిమాకు 1000 కోట్లకి పైగా కలెక్షన్లు వచ్చాయి. దానితో అట్లీ స్థాయి ఇండియా వ్యాప్తంగా పెరిగి పోయింది. ఇకపోతే జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత అట్లీ అల్లు అర్జున్ తో మూవీ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆల్మోస్ట్ ఈ కాంబో మూవీ సెట్ అయినట్లు వార్తలు ప్రచారం అయ్యాయి. కానీ మళ్ళీ ఈ కాంబోలో మూవీ క్యాన్సిల్ అయింది అని వార్తలు వచ్చాయి. మళ్ళీ కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్ , అట్లీ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు అన్ని సెట్ అయితే వీరి కాంబోలో మూవీ ఓకే అయ్యే ఛాన్స్ ఉంది అని ఓ వార్త వైరల్ అయింది.

ఇకపోతే ప్రస్తుతం అట్లీ , అల్లు అర్జున్ తో కాకుండా సల్మాన్ ఖాన్ , కమల్ హాసన్ హీరోలుగా ఓ భారీ మల్టీస్టారర్ మూవీ ని ప్లాన్ చేస్తున్నట్లు అంతా సెట్ అయితే ఆ ఇద్దరు హీరోలతో అట్లీ తదుపరి మూవీ చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇక అట్లీ తదుపరి మూవీ ఎవరితో చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: