కథ వినకుండానే ఆ సినిమా చేశాను.. ఆ తర్వాత పెద్ద బ్లాక్ బాస్టర్.. రవితేజ..?

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ కెరీర్ ప్రారంభం లో చాలా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు . అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన తర్వాత రవితేజ సినిమాల్లో నటించడం మొదలు పెట్టాడు . అందులో భాగం గా కెరీర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించడం , విలన్ పాత్రలో , ముఖ్యమైన పాత్రలో నటించడం ఇలా చాలా సంవత్సరాల పాటు కెరియర్ను ముందుకు సాగించాడు . అలా నటుడి గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆ తర్వాత హీరోగా సినిమాల్లో నటించడం మొదలు పెట్టాడు.

ఈయన హీరోగా నటించిన సినిమాలు ఎక్కువ శాతం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు సాధిస్తూ రావడంతో చాలా తక్కువ కాలం లోనే రవితేజ కు తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన హీరోగా గుర్తింపు వచ్చింది. ఇక ప్రస్తుతం రవితేజ టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే రవితేజ కొంత కాలం క్రితం ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అందులో భాగంగా రవితేజ నాకు ఎవరైనా కథ చెప్పేటప్పుడు ఆ సినిమాలోని హీరో క్యారక్టరైజేషన్ నాకు అద్భుతంగా నచ్చినట్లు అయితే ఆ సినిమా కథ మొత్తం పూర్తి కాకపోయినా ఆ మూవీ ని ఓకే చేస్తూ ఉంటాను.

కొన్ని సంవత్సరాల క్రితం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నేను కిక్ అనే సినిమాలో హీరోగా నటించాను. ఆ మూవీ కి సంబంధించిన కథ సగం విన్నాను. అందులోనే హీరో క్యారక్టరైజేషన్ అద్భుతంగా అనిపించింది. దానితో ఆ సినిమా సెకండాఫ్ వినకుండానే మూవీ ని ఓకే చేశాను. ఇక ఆ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయం అందుకుంది అని రవితేజ తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rt

సంబంధిత వార్తలు: