Devara: స్టోరీ లైన్ ఇదే.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!
చిత్రానికి సంబంధించి ఒక స్టోరీ లైన్ టాలీవుడ్లో తెగ వైరల్ గా మారుతున్నది. దేవర సినిమా ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. దేవర సినిమాలోని కొంత భాగం నిజజీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కించారట. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్లోని వేలాది మంది ప్రజల జీవితాల పైన చాలా ప్రభావం చూపించిందని సమాచారం. గతంలో కూడా శ్రీమంతుడు ,ఆచార్య వంటి సినిమాలలో కూడా కొంతమేరకు నిజజీవితంలో జరిగిన సంఘటనలు తీసుకోవచ్చారు. అలా ఇప్పుడు దేవరలో కూడా వాస్తవ సంఘటన ఆధారంగానే కథ ఉండబోతున్నట్లు సమాచారం.
1985లో ఆంధ్రప్రదేశ్లో కారంచేడు ఘటనలో జరిగిన ఒక సంఘటన ఆధారంగానే దేవర చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా దళితులపై జరిగిన హింస నేపథ్యంలోనే ఈ చిత్రం ఉండబోతుందని సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇందులో రెండు ముఖాలను చూపించడం జరిగింది. ఇందులో ఇద్దరు ఎక్స్ప్రెషన్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయని.. బయటికి తగ్గట్టుగా ఫేసెస్ ఆఫ్ ఫియర్ అనే ట్యాగ్ కూడా చేశారు. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయ లో నటిస్తూ ఉండడమే కాకుండా రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.