బాలయ్య - నాగార్జున గొడవలు కంటిన్యూ.. ఈ సారి అది కూడా చేయని నాగ్.. !
టాలీవుడ్లో మెగా పవన్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య నడుస్తున్న సోషల్ మీడియా వార్ గురించి అందరికీ తెలిసిందే. బాలయ్య 50 వసంతాల సినీ కెరీర్ సందర్భంగా.. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఒకే వేదిక మీదకు వస్తారని అందరూ భావించారు. బాలయ్య.. అల్లు అర్జున్ను, పవన్ కళ్యాణ్ ను కలపబోతున్నారంటూ ఒక్కటే ప్రచారం జరిగింది. అయితే అనుహ్యంగా ఈ వేడుకకు ఇద్దరూ రాలేదు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అదే టైంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండడంతో.. అక్కడ భారీ వరదల నేపథ్యంలో పుట్టినరోజు వేడుకలు, ఇటు బాలయ్య ఫంక్షన్కు వస్తే విమర్శలు వస్తాయని వాటికి దూరంగా ఉన్నారు.
ఇదిలా ఉంటే గత కొన్నేళ్లుగా బాలయ్యకు, నాగార్జునకు మధ్య దూరం బాగా పెరిగింది. ఇద్దరికీ తేడా వచ్చి దాదాపు 15 ఏళ్ళు దాటుతోంది. మధ్యలో చాలాసార్లు నాగార్జున బాలయ్యను కలుపుకు పోయేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే అది సాధ్యం కాలేదు. కాగా ఈసారి బాలయ్య 50 వసంతాల సినీ వేడుకకు నాగార్జునకు ఆహ్వానం అందిందని చెబుతున్నారు. అయిన నాగార్జున ఈ వేడుకకు డుమ్మా కొట్టేశారు. ఇంకా చెప్పాలంటే ఈ ఫంక్షన్కు అక్కినేని కుటుంబం మొత్తం దూరంగా ఉంది.
సాధారణంగా ఇలాంటి ఇబ్బందికర పరిస్తితులు వచ్చినప్పుడు నాగార్జున చాలా తెలివిగా నాగచైతన్యను ముందుకు తోస్తారు. తన తరఫున తన పెద్ద కొడుకుగా నాగచైతన్యను ఇలాంటి ఫంక్షన్లకు పంపుతూ ఉంటారు. ఈసారి కూడా నాగార్జున చైతన్య పంపిస్తారని కొందరు భావించారు. అయితే ఈసారి నాగార్జున ఆ పని కూడా చేయలేదు. ఏది ఏమైనా నాగార్జున.. బాలయ్య మధ్య ఉన్న గ్యాప్ అయితే ఏ మాత్రం తగ్గలేదు అన్నది మరోసారి బాలయ్య 50 వసంతాల సినీ వేడుక సందర్భంగా ప్రూవ్ అయింది.