ఆ మూవీ దెబ్బకి కొత్త దర్శకులతో సినిమా చేయొద్దు అనుకున్నాను.. స్టార్ ప్రొడ్యూసర్..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నిర్మాతలలో v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">డి వి వి దానయ్య ఒకరు. ఈయన డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనేక సినిమాలను నిర్మించాడు. ఇకపోతే ఈయన తాజాగా సరిపోదా శనివారం అనే సినిమాను నిర్మించాడు. ఈ మూవీ లో నాని హీరోగా నటించగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించింది. వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఆగస్టు 29 వ తేదీన విడుదల అయ్యి మంచి టాక్ ను తెచ్చుకుంది. దానితో ప్రస్తుతం ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ కలెక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా దక్కుతున్నాయి. తాజాగా దానయ్య ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.

అందులో భాగంగా కొత్త దర్శకులతో సినిమాలు నిర్మించేందుకు భయపడతాను అని చెప్పి అందుకు గల కారణాలను ఆయన చెప్పుకొచ్చాడు. అసలు విషయం లోకి వెళితే ... దానయ్య తాజా ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... నేను కొత్త దర్శకులతో సినిమాలు చేయడానికి భయపడతాను. దానికి ప్రధాన కారణం కొన్ని సంవత్సరాల క్రితం సిద్ధార్థ్ హీరోగా రూపొందిన ఓయ్ అనే సినిమాను కొత్త దర్శకునితో తెరకెక్కించాను. ఆ సినిమా కోసం పెద్ద పెద్ద సెట్లు వేశాం.

భారీ బడ్జెట్ తో ఆ మూవీ ని రూపొందించాం. సినిమా విడుదల అయిన తర్వాత అది వర్కౌట్ కాలేదు. దానితో నేను కొత్త దర్శకులతో సినిమా చేయడానికి భయపడతాను. కానీ శివ నిర్వాణ అనే దర్శకుడిని నేనే పరిచయం చేశాను. నిన్ను కోరి మూవీ తోనే ఆయన దర్శకుడిగా పరిచయం అయ్యాడు. నేను అతనితో సినిమా చేయొద్దు అనుకున్నాను. కాకపోతే నిన్ను కోరి సినిమా కథను మొత్తం ఆయన చెప్పాడు. దానితో ఆ సినిమా బాగుంటుంది , అది వర్కౌట్ అవుతుంది అనిపించింది. అందుకే ఆ సినిమా చేశాను అని దానయ్య తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: