హీరోలకు తల్లిగా నటిస్తున్న ఈ నటి.. బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాకే?
వాస్తవానికి తమిళ నటి అయిన ఈమె ముంబైలో పెరిగింది. ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ పూర్తి చేసిన కళ్యాణి.. చిన్నపిల్లలకు పాటలు చెప్పే టీచర్ గాను.. ట్రైనింగ్ తీసుకుంది. అయితే చిన్నప్పటినుంచి ఈమెకు యాక్టింగ్ అంటే ఎంతో ఇష్టం. కానీ వైవాహిక జీవితంలో బిజీగా ఉండడంతో పిల్లలు ఉద్యోగం అంటూ గడిపేసింది. ఇక ముంబైలో థియేటర్ ఆర్టిస్టుగా ట్రైనింగ్ తీసుకుని అనేక నాటకాల్లోనూ నటించి ప్రదర్శనలు ఇచ్చింది. ఇలా ఒక జూలరీ యాడ్ చేసే అవకాశం వచ్చింది. తర్వాత సినిమా డైరెక్టర్ల కంట పడి తమిళ చిత్రంతో వెండితెర రంగ ప్రవేశం చేసింది. ఇక తర్వాత ఓ బాలీవుడ్ మూవీ లోను నటించింది.
ఇక తర్వాత కాలంలో వరుసగా తమిళ సినిమాలు చేసి సూపర్ సక్సెస్ అయింది కళ్యాణి నటరాజన్. తెలుగులో బాలకృష్ణ డిక్టేటర్ మూవీతో తెరంగేట్రం చేసిన ఈమె వెనుతిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత మహానుభావుడు సినిమాలో శర్వానంద్ తల్లిగా నటించింది. ఎక్కువగా తెలుగు తమిళంలో హీరో హీరోయిన్ల తల్లి పాత్రలోనే కనిపించింది. గీత గోవిందం, శైలజ రెడ్డి అల్లుడు, పడి పడి లేచే మనసు, డియర్ కామ్రేడ్, ఏబిసిడి, అలా వైకుంటపురం, భీష్మ, వరుడు కావలెను, ఆడాళ్లు మీకు జోహార్లు, వాల్తేరు వీరయ్య ఆమీగోస్, రావణాసుర, రంగబలి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాల్లోనే నటించింది. ఆమెకు ఇద్దరు కొడుకులు సినిమాల్లోనే కాదు యాడ్స్ కూడా చేస్తూ మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ గా మారింది. ఈమె భర్త బాలకృష్ణ నటరాజన్ తో కలిసి ముంబైకి చెందిన థియేటర్ ప్రొడక్షన్ హౌస్ క్లీన్ స్లేట్ క్రియేషన్స్ స్థాపించింది.