ప్రతిరోజు నిన్ను మిస్ అవుతూనే ఉంటా.. లైగర్ బ్యూటీ పోస్ట్..!
ఏం అమ్మడు స్టూడెంట్ ఆఫ్ ది ఇయన్ మూవీతో ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అలాగే తెలుగులో విజయ్ దేవరకొండ సరసన 'లైగర్' మూవీలో చేసింది. కానీ ఈ సినిమా భారీ డిజాస్టర్ కావడంతో అనన్య బాలీవుడ్ చెక్కేసింది. ప్రజెంట్ అడపాదడపా చిత్రాలు చేస్తూ హీరోయిన్గా ఇండస్ట్రీలో రాణిస్తుంది. ఆమె నటించి తాజా మూవీ 'కాల్ మీ బే' ఇది డైరెక్ట్ గా ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతుంది.
ఇదిలా ఉంటే..అనన్య సినిమాలు చేయడంతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ పలు పోస్టులు పెడుతుంది. తాజాగా, ఈ అమ్మడు తన పెట్ ను తలుచుకుని ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. "2008లో ఫడ్జ్ నిన్ను నేను కోల్పోయాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతుంటున్నా. ఐ లవ్ యు ఫైటర్. 16 సంవత్సరాల జీవితం నీవల్లే ఆనందంతో నిండి ఉంది. నేను ప్రతి రోజు నిన్ను మిస్ అవుతూనే ఉంటా" అని రాసుకొచ్చింది. ప్రజెంట్ అనన్య పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అది చూసినవారు రెడ్ హాట్ సింబల్ షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్ ఉంటే వైరల్ గా మారింది. ఇది చూసిన ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు.