పదేళ్లుగా అభిమన్యుడిని ప్రేమిస్తున్న సాయి పల్లవి.. అతనెవరంటే..?
యాంకర్ ఇప్పటి వరకు మీరు ప్రేమలో పడలేదా అని అడగగా.. అందుకు సాయి పల్లవి మహాభారతి ఇతిహాసం అంటే తనకు చాలా ఇష్టమని అందులో ఉండే అభిమన్యుతో తాను ప్రేమలో పడ్డానని తను అంటే తనకు చాలా ఇష్టమని తెలియజేసింది. గత 10 ఏళ్లు గా అభిమన్యుడు పాత్ర గురించి తాను ఏదో ఒక కొత్త విషయం తెలుసుకుంటూనే ఉన్నట్లుగా తెలియజేసింది సాయి పల్లవి. అందుకే అతనికి సంబంధించిన ఎలాంటి విషయాన్నైనా సరే తనలో ఆసక్తిని పెంచుతాయి అంటూ తెలియజేసింది.
అంతేకాకుండా గత 10 ఏళ్లుగా ఆయనతో ప్రేమలో ఉన్నానంటూ చాలా స్మైలీగా తెలియజేసింది సాయి పల్లవి.. అయితే ఈ విషయాలు విన్న అభిమానులు సైతం ఆశ్చర్యపోయిన మహాభారతం అంటే తనకు ఇష్టమని చెప్పడంతో మరికొంతమంది విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సాయి పల్లవి సినిమాల విషయానికి వస్తే తెలుగులో నాగచైతన్యతో తండేల్, హిందీలో రామాయణ, తమిళంలో అమరన్ వంటి చిత్రాలలో నటిస్తూ ఉన్నది.. అయితే గడిచిన కొద్దిరోజుల క్రితం నుంచి తాను ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి తన వృత్తి అయిన డాక్టర్ కోర్స్ పూర్తి చేసి వైద్యురాలు కాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. అభిమానులైతే సినిమాలలో నటించమని కోరుతున్నారు.