ఫన్ టాస్టిక్ గా గోపీచంద్ "విశ్వం" టీజర్..శ్రీనువైట్ల మార్క్ కామెడీ అదిరిందిగా..!!

murali krishna
టాలీవుడ్ యాక్టర్‌ గోపీచంద్ నటిస్తోన్న చిత్రం విశ్వం . శ్రీను వైట్ల  దర్శకత్వంలో గోపీచంద్ 32గా వస్తోంది. కొన్ని రోజుల క్రితం జర్నీ ఆఫ్‌ విశ్వం వీడియోను షేర్‌ చేయగా.. ఫన్‌, సీరియస్‌ ఎలిమెంట్స్‌తో సినిమా సాగనున్నట్టు చెప్పకనే చెబుతోంది. మళ్లీ చాలా రోజుల తర్వాత ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్‌ను టీజర్‌ రూపంలో అందించింది శ్రీను వైట్ల టీం.ఈ నేపథ్యంలోనే విశ్వం మూవీ టీజర్ ఈరోజు నాలుగు గంటలు ఐదు నిమిషాలకు విడుదలైంది. "కొట్టారు తీసుకున్నాం రేపు మాకు టైం వస్తుంది మేము కొడతాం" అంటూ వైసీపీ చీఫ్ జగన్ డైలాగ్ తో టీజర్ ఆసక్తికరంగా ఉంది శ్రీను వైట్ల మార్క్ కామెడీతో గోపీచంద్ యాక్షన్ తో టీజర్ ఆకట్టుకుంటుంది.ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది.ఇంతకీ సంబంధం అబ్బాయికా అమ్మాయికా అనే డైలాగ్ తో ఫన్నీ గా టీజర్ స్టార్ట్ అయింది. బంగినపళ్లి లాంటి పాపకు కలెక్టర్ లాంటి కుర్రాడిని నీవే వెతకాలి అని నరేష్ చెబుతారు. కనపడగానే నా మీద పడిపోవాలి.. నైట్ అంతా మెలకువగా ఉండాలని హీరోయిన్ అంటోంది. ఇంతలో హీరో ఎంట్రీ ఇచ్చి.. ఫాదర్ అంటే ఇష్టమని చెబుతాడు. ఆ తర్వాత నీ అబ్బా అనే మాటను అందరూ అంటుంటారు. అది నచ్చిన హీరో చితక్కొడుతుంటాడు.
ఆ తర్వాత ట్రైన్ సీన్ స్టార్ట్ అయింది. సీక్వెన్స్ అంతా ఫుల్ కామెడీగా ఉంది. స్టార్ కమెడియన్లు అంతా సందడి చేశారు. అప్పటి వరకు ఫన్నీగా సాగిన టీజర్.. సీరియస్ మోడ్ లోకి వెళ్లింది. హీరో గోపీచంద్.. ఎవరో వెంటాడుతున్నట్లు చూపించారు. ఆ తర్వాత ఫైట్ తో అదరగొట్టారు. చివర్లో వెన్నెల కిషోర్ సీన్ తో ముగిసింది. ఓవరాల్ గా టీజర్.. సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. కామెడీతో మెప్పిస్తోంది.ఈ చిత్రంలో కావ్యథాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. గోపీమోహన్‌ స్క్రీన్‌ ప్లే సమకూరుస్తుండగా.. చేతన్ భరద్వాజ్‌ మ్యూజిక్, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు. ఈ సారి గోపీచంద్ ఫుల్‌ లెంగ్త్‌ యాక్షన్‌ ప్యాక్‌డ్‌ రోల్‌లో కనిపించబోతున్నట్టు అర్థమవుతోంది. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌లో వస్తున్న తొలి సినిమా ఇది. ఇక ఫస్ట్ స్ట్రైక్‌లో తెగిపడటం.. తెగించగలడం క్రమాన ఫలితం.. విధాత విశ్వం అంటూ సాగే టైటిల్‌ ట్రాక్‌ సినిమాపై అంచనాలు పెంచుతోంది.ఈ మూవీని చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై పాపులర్‌ డిస్ట్రిబ్యూటర్‌ కమ్‌ ఎగ్జిబిటర్‌ వేణు దోనెపూడి పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీతో కలిసి తెరకెక్కిస్తు్న్నారు. గింజ గింజపై తినేవాడి పేరు రాసి ఉంటుంది. దీనిపై నా పేరు ఉంది.. అంటూ ఫస్ట్ స్ట్రైక్‌లో గోపీచంద్‌ చెబుతున్న డైలాగ్స్‌ సినిమాపై సూపర్ హైప్‌ క్రియేట్ చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: