స్టార్ హీరో పై లైంగిక వేధింపుల కేసు.. ఎవరంటే..?
గత ఏడాది నవంబర్లో సినిమా అవకాశాల గురించి మాట్లాడాలని తనని దుబాయ్ కి తీసుకువెళ్లారని అక్కడ తన పైన అత్యాచారం జరిగింది అంటూ కూడా ఆ మహిళ ఫిర్యాదులో తెలియజేసినట్లు సమాచారం. దీంతో ఎర్నాకులం పోలీసులు సైతం నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసును నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రత్యేకంగా అధికారులు ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారట పోలీసులు. ఆ మహిళ ఇది విదేశాలలో జరిగిందని హీరో నివిన్ పౌలి తో పాటు మరికొంతమంది తనను చాలా హింసించి మరి ఇబ్బందులకు గురి చేశారని ఫిర్యాదులో తెలియజేసింది.
దీంతో పోలీసులు సైతం ఈ కేసును ప్రత్యేకమైన బృందానికి ఇచ్చి మరి ఈ కేసు పైన దర్యాప్తు చేయాలని సూచించారట. ముఖ్యంగా మలయాళ సినీ ఇండస్ట్రీలో జస్టిస్ హేమ కమిటీ వల్ల ఇప్పటికే చాలామంది నటీమణులు సైతం తమకు జరిగిన కొన్ని చేదు సంఘటనలను ఇలా ధైర్యంగా వచ్చి ముందుకు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా డైరెక్టర్లు సీనియర్ నటులు మరికొంతమంది నటుల పైన కూడా ఇప్పటికే పలు రకాల ఆరోపణలు వచ్చాయి. హేమ కమిటీ నివేదిక బయటికి వచ్చిన తర్వాత ఎర్నాకులంలో కేసులు నమోదైన సంఖ్య 11 కు చేరినట్లు సమాచారం. మరి రాబోయే రోజుల్లో మరిన్ని విషయాలు బయటకి వస్తాయో చూడాలి.