అక్కినేని నాగార్జునను తొక్కేస్తున్న టాలీవుడ్‌ ?

Veldandi Saikiran

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని అందిపుచ్చుకొని... ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోగా కొనసాగుతున్నారు అక్కినేని నాగార్జున. అక్కినేని నాగార్జున తో పాటు ఆయన సంతానం... కూడా ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఇప్పటికే అక్కినేని నాగచైతన్య మరియు అక్కినేని అఖిల్ ఇద్దరు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్నారు.
 

అక్కినేని నాగార్జున కొడుకులు ఇంకా... పెద్దగా సక్సెస్ కాలేదు. ఫ్యూచర్లో కచ్చితంగా అక్కినేని నాగచైతన్య మరియు అఖిల్ ఇద్దరు సక్సెస్ అవుతారని అందరూ నమ్ముతున్నారు. ఇలాంటి నేపథ్యంలో అక్కినేని నాగార్జున తన బిజినెస్ లను... విజయవంతంగా కొనసాగిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియో, ఇతర బిజినెస్ లను కూడా  సక్సెస్ గా నడిపిస్తున్నారు అక్కినేని నాగార్జున.  అలాంటి అక్కినేని నాగార్జున కు తాజా గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది.
 

ఆయన హైదరాబాదులో నిర్మించుకున్న ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కబ్జా చేసి.. ఈ ఎన్ కన్వెన్షన్ నిర్మించారని.... హైడ్రా కూల్చివేసింది.  అక్కినేని నాగార్జునకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే.. పొద్దు పొద్దున్నే వచ్చి హైడ్రాధికారులు ఎన్ కన్వెన్షన్ ను ధ్వంసం చేశారు. దీంతో అక్కినేని నాగార్జునకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్న అక్కినేని నాగార్జునకు అంత ఎదురు దెబ్బ తగిలితే టాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరు స్పందించలేరు.
 

కానీ హైడ్రా అధికారులకు సపోర్ట్ గా కొంతమంది టాలీవుడ్ సెలబ్రిటీలు నిలుస్తూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నారు. టాలీవుడ్ దర్శకుడు హరిశంకర్, మిగతా నిర్మాతలు అలాగే సెలబ్రిటీలు కూడా.. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ... అక్కినేని నాగార్జునను తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఒక పెద్ద కు సమస్య వస్తే అందరూ ఏకమై పోరాడాలి కానీ... ఆయనని తొక్కేయడం ఏంటని అక్కినేని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: