విజయ్ ' గోట్ ' తెలుగులో ఈ టార్గెట్ రీచ్ అవుతుందా... ఓహో మైత్రీ వాళ్ల స్కెచ్ వేరేనా..?
ఏపీ, తెలంగాణ స్టేట్ కలిపి రూ.22 కోట్ల మేరకు వసూళ్ళు చేయాలంటే సినిమా చాలా పెద్ద హిట్ కొట్టాల్సి ఉంటుంది. అంతకన్నా ముందు మంచి ఓపెనింగ్ పడాలి. ఇప్పటికే థియేటర్లలో నాని నటించిన సరిపోదా శనివారం మూవీ ఉంది. మరో మూడు ప్రామిసింగ్ సినిమాలు గోట్‌తో పాటు వస్తున్నాయి. ఇవన్నీ దాటుకుని గోట్ వసూళ్లు సాధించాలి. గోట్‌కు తెలుగు నాట సమస్య ఏంటంటే.. పెద్దగా పబ్లిసిటీ కూడా లేదు. ఈ సినిమా టీం కేవలం తమిళనాట ప్రచారం చేయడంతోనే సరిపెట్టేసింది. ఇక్కడ అస్సలు పట్టించుకోలేదు. ఇక విజయ్ కూడా ముందు నుంచి తన సినిమాలు తెలుగులో మార్కెట్ పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడే తప్ప.. ఇక్కడ అస్సలు పబ్లిసిటీ చేయటం లేదు.
విజయ్‌కు తెలుగు మార్కెట్ కావాలి. తెలుగు నుంచి తన సినిమాలకు డబ్బులు రావాలి తప్ప.. ఇక్కడ ప్రచారం చేయడు. పబ్లిసిటీ చేయడు. ఎవరిని పట్టించుకోరు. తెలుగు వాళ్ళు అంటే విజయ్‌కు చాలా చిన్న చూపు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. కనీసం తన కెరీర్‌లో చివరి సినిమా అని ప్రచారం జరుగుతున్న గోట్.. తెలుగు దర్శనకు కూడా ప్రమోషన్ చేయలేదు. జస్ట్ టీమ్ వచ్చి హడావిడి చేసి వెళ్ళింది. కానీ అది జనానికి రీచ్ కాలేదు. కనీసం రెండు మూడు వారాల ముందు నుంచి హడావుడి చేసి ఉంటే వేరుగా ఉండేది. పైగా గోట్ టైటిల్ కూడా కాస్త వీక్ అయ్యినటు వినిపిస్తోంది. అందువల్ల ఈ సినిమా తెలుగులో రూ.22 కోట్ల స్టేట్ టార్గెట్ రీచ్ అవుతుందా.. లేదా.. అన్నది చూడాలి.