' స‌రిపోదా శ‌నివారం ' కు దెబ్బ కొట్టిందెవ‌రు... హిట్ అయినా లాభాలు లేవా... !

RAMAKRISHNA S.S.
నేచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం కాస్త పాజిటివ్ టాక్ తో.. కాస్త డివైడ్ టాక్ తో.. ఓవ‌వరాల్‌గా మూడు వంతుల పాజిటివ్ టాక్‌తో థియేటర్లలో నిలబడింది. ఈ సినిమాకు అన్నిటికన్నా కలిసి వచ్చిన అదృష్టం ఏంటంటే.. నాలుగు వారాలపాటు మరో సినిమా లేకపోవడం.. సాధారణంగా ఇలాంటి అదృష్టం ఏ సినిమాకు కానీ లభించదు. సరిపోదా శనివారం సినిమా రిలీజ్ అయిన నాటి నుంచి నాలుగు వారాలపాటు మరో పెద్ద సినిమా అన్నది లేదు. మళ్లీ సెప్టెంబర్ 27న దేవర సినిమా రిలీజ్ అవుతుంది. ఈ లోపు నాలుగు వారాలు అన్ని చిన్న కంటెంట్ ఉన్న సినిమాలే. సెప్టెంబర్ 5న విజయ్ గోట్‌ సినిమా ఉంది. అది డబ్బింగ్ సినిమా. దాని ప్రభావం టాలీవుడ్ మీద అంతగా ఉండదు.

పైగా వినాయక చవితి శనివారం ఉంది అంటే విడుదలైన మరుసటి వారం కూడా వరుస సెలవులు. నాని సరిపోదా శనివారం సినిమాకు బాగా కలిసి వచ్చాయి. ఇలాంటి కీలకమైన డేట్ ను తర్వాత వచ్చే వినాయక చవితి వీకెండ్.. టాలీవుడ్‌లో మిగిలిన సినిమాలు ఏవి పట్టించుకోలేదు. ఇక టాలీవుడ్ కింగ్ దిల్ రాజు సరిపోదా శనివారం సినిమాను ఏపీ, తెలంగాణ ఏరియాలకు అవుట్ రైట్ రేట్‌కు కొనేశారు. ఇక మార్కెటింగ్ సంగతి చూస్తే.. ఏపీలో రూ.15 కోట్ల రేటు.. సీడెడ్ రూ.5.40 కోట్ల రేంజ్‌లో మార్కెట్ చేశారు. నైజాం దిల్ రాజు సొంతంగా విడుదల చేసుకున్నారు. సినిమాను రూ.25 కోట్లు ప్లస్ జీఎస్టీ లెక్క అమ్మేరు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఎనిమిదిన్నర‌ కోట్ల మేర అని అంచనా వేసుకోవచ్చు. అయితే వసూళ్లు సంగతి చూస్తే నైజాంలో నాలుగు రోజులకే బ్రేక్ ఈవెన్ అయిపోయింది.

వాస్తవంగా నాని నటించిన బ్లాక్ బస్టర్ దసరా సినిమాతో పోల్చుకుంటే.. ఈ నెంబర్‌లు చాలా చిన్నవి. అయినా ఈ సినిమాను అమ్మిన రేట్ల ప్ర‌కారం  చూసుకుంటే పరవాలేదు అని చెప్పాలి. అయితే ఏపీలో ఇంకా చాలా ఏరియాలలో ఈ సినిమా బ్రేకింగ్ కావాల్సి ఉంది. విశాఖలో ఇప్పటికి రూ.2 కోట్లు వచ్చాయి. మరో కోటిన్నర రావాల్సి ఉంది. ఈస్ట్ లో కోటి వచ్చినా మరొ రు. 70 లక్షల వరకు రావాలి. వెస్ట్ లో రూ.70 లక్షలు వచ్చింది. మరో కోటి రూపాయలు రావాలి. అలాగే కృష్ణ, గుంటూరు, నెల్లూరులో వరదలు ఎక్కువగా ఉండడంతో.. అక్కడ సగం మాత్రమే రికవరీ అయింది. మరో మూడు కోట్లు రావాల్సి ఉంది. ఇవన్నీ కొన్న రేటుకు మాత్రమే మరో 10% అన్నా కమీషన్ రావాలి. ఖర్చులు రావాలి. అయితే ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే మరో మూడు వారాల వరకు పెద్ద సినిమా లేదు. ఇవన్నీ కలిసి వస్తే తప్ప సరిపోదా శనివారం సినిమాకు మంచి లాభాలు వచ్చే పరిస్థితి అయితే లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: