నార్త్ అమెరికాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన " సరిపోదా శనివారం " కలెక్షన్స్..!

lakhmi saranya
నాచురల్ స్టార్ నాని ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. నాని రీసెంట్గా హాయ్ నాన్న మూవీలో హీరోగా చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ సినిమా సెంటిమెంట్ సీన్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక హాయ్ నాన్న మూవీ లో హీరోయిన్ గా మనాల్ ఠాగూర్ చేసిన సంగతి కూడా తెలిసిందే. ఇక వీరిద్దరికీ ఒక చిన్న పాప ఉంది తన గురించే ఈ కథ మొత్తం. నాని ఈగ, ఎంసీఏ, సాంసంగ్ రాయ్, నేను లోకల్ ఇలాంటి సినిమాల్లో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు సరిపోదా శనివారం మూవీలో హీరోగా నటించాడు నాని.
ఇక ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్టును అందుకుంది. కానీ వరదల కారణంగా మూడో రోజు కలెక్షన్స్ కొంచెం తగ్గాయి. కానీ నాలుగో రోజు కలెక్షన్స్ విషయానికి వెళ్తే..నాలుగో రోజు కలెక్షన్ కూడా బానే వచ్చాయి. తెలుగు సినీ పరిశ్రమలో వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో నేచురల్ స్టార్ నాని. సరిపోదా శనివారం అంటూ ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా బాక్స్ ఫీస్ వద్దా భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. నార్త్ అమెరికాలో ఈ దూకుడు మరింతగా ఉంది. ఈ చిత్రం అక్కడ ఇప్పటి వరకు 2.1 మిలియన్ డాలర్లకి పైగా వసూళ్లు రాబట్టింది.
 ఇది సెన్సేషన్ రెస్పాన్స్ అని చెప్పాలి. నార్త్ అమెరికాలో నానికి ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో, ఈ వసూళ్లు నిదర్శనం. సినిమా సినిమాకి వైవిధ్యం కనబరుస్తూ, ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. ఆ చిత్రంలో ప్రియాంక మోహన్, ఎస్, జే సూర్య కీలక పాత్రలో నటించగా, వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక నెక్స్ట్ రాబోయే సినిమా ఏంటో చూడాల్సిందే. నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం బిజీబిజీ లైఫ్ నువ్వు కడుగుతున్నాడు. ఎందుకంటే సినిమాలతో చాలా బిజీ అయిపోయాడు నాని. సరిపోదా శనివారం మూవీ తర్వాత ఇంకా ఎన్ని సినిమాలు ఉన్నాయో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: