ఫ్యాన్స్ సిద్ధమవ్వండమ్మా.. ఎన్టీఆర్ మాస్ డాన్స్ కు ఇంకొద్ది గంటలే సమయం..!!

murali krishna
గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ‘దేవర’. ఈ మూవీకి కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందు రానుంది. అయితే ఫస్ట్ పార్ట పాన్ ఇండియా రేంజ్‍లో భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటీకే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫ‌స్ట్ లుక్‌, గ్లింప్స్‌కు రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి మూడో పాటకు సంబంధించి మేకర్స్ ఆసక్తికర అప్‌డేట్ అందించారు.విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డటంతో వ‌రుస అప్‌డేట్‌ల‌ను ప్ర‌క‌టిస్తుంది చిత్ర‌బృందం. ఇప్ప‌టికే మూవీ నుంచి ఫ‌స్ట్ సింగిల్ ఫియ‌ర్ సాంగ్‌తో పాటు సెకండ్ సింగిల్ చుట్ట‌మ‌ల్లే పాట‌ల‌ను విడుద‌ల చేయ‌గా.. ఈ రెండు పాట‌లు యూట్యూబ్‌లో దూసుకుపోతున్నాయి. అయితే తాజాగా ఈ మూవీ నుంచి థ‌ర్డ్ సింగిల్ అప్‌డేట్ ఇచ్చారు మేక‌ర్స్. ఈ మూవీ నుంచి థ‌ర్డ్ సింగిల్ ‘దావుడి’ సాంగ్‌ను ఈరోజు సాయంత్రం 5.04 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా కొత్త పోస్ట‌ర్‌ను పంచుకుంది.

ఇక సాంగ్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సాంగ్‌‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. పక్క మాస్ అండ్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ తారక్ సొంత నిర్మణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్‌ బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్ రామ్, కొసరాజు హరికృష్ణ సంయక్తంగా నిర్మిస్తున్నారు.అంతేకాదు పోస్టర్ చూస్తుంటే రాబోయే సాంగ్ ఓ రేంజ్‌లో ఉండబోతుందనే విష‌యం అర్థ‌మ‌వుతోంది. పోస్టర్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్  హ్యాపీ మూడ్‌లో ఓ డ్యాన్స్ స్టెప్‌లో కనిపిస్తున్నారు. ఈ పాట ఈ సినిమాకే హైలెట్ అనేలా చిత్రీకరణ జరిపినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది.ఈ వీడియో సాంగ్ లో జాన్వి కపూర్ ఎన్టీఆర్ డాన్స్ అదిరిపోయిందని మేకర్స్ చెబుతున్నారు ఈ క్రమంలో వీరిద్దరూ స్టెప్పులు వేసిన ఫోటోలు సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందిస్తుండడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: