సౌత్ ఇండస్ట్రీ లో శృంగార తారగా పేరున్న వారిలో నటి షకీలా ఒకరు.. ఈమె తన అంద చందాలతో ఎంతోమంది కుర్రకారును ఫిదా చేసింది. ఇక షకీలా సినిమాలు వస్తున్నాయి అంటే ఎంతో మంది హీరోలు తమ సినిమాలను వాయిదా వేసుకునేవారు. అలా అప్పట్లో తన భారీ అందాలతో ఎంతోమంది కుర్రకారును ఉర్రూతలూగించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఏజ్ మీద పడడంతో కాస్త సినిమాలకు దూరం అవుతోంది. తెలుగు బిగ్ బాస్ 7 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికి ఎక్కువ రోజులు కొనసాగలేకపోయింది.ఇక ప్రస్తుతం మాలీవుడ్లో హేమ కమిటీ రిపోర్టు సంచలన సృష్టిస్తున్న వేళ ఓ తెలుగు డైరెక్టర్ చేసిన పనిని బహిరంగంగా పేరుతో సహా బయట పెట్టింది షకీలా..షకీలా కేవలం తమిళ, కన్నడ, మలయాళం సినిమాల్లోనే కాకుండా తెలుగు సినిమాల్లో కూడా నటించింది.
అలా తెలుగులో ఎన్నో వ్యాంపు పాత్రలు పోషించిన షకీలాకి ఓ తెలుగు డైరెక్టర్ దగ్గర చేదు అనుభవం ఎదురయ్యిందట..షకీలా ఓ ఇంటర్వ్యూ లో ఈ విషయాన్ని మాట్లాడుతూ.. నన్ను ఓ తెలుగు స్టార్ దర్శకుడు స్వయంగా ఆ పదాన్ని పలకకుండా ఆ విధంగా చూస్తూ అలా పక్కకి రమ్మన్నాడు.. అంతేకాదు అలా వస్తే తన నెక్స్ట్ సినిమాలో కూడా నాకు అవకాశం ఇస్తానన్నాడు.కానీ నేను మాత్రం అవకాశం వద్దు ఏమీ వద్దు అని ఆ డైరెక్టర్ ప్రవర్తనని తప్పు పట్టి ఆయన సినిమాల్లో కూడా నేను నటించలేదు.
ఇక ఆయన ఎవరో కాదు స్టార్ డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ అంటూ సంచలన విషయాన్ని బయటపెట్టింది నటి షకీలా. ఇక దివంగత నటుడు ఇవివి సత్యనారాయణ అంటే ఎవరో కాదు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్ తండ్రి.. ఇవివి సత్యనారాయణ ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించారు. అయితే అలాంటి పేరున్న డైరెక్టర్ షకీలాని పక్కలోకి రమ్మన్నారంటే ఆయన గతంలో ఎంతమంది తన సినిమాల్లో చేసిన హీరోయిన్స్ ని వాడుకున్నాడో అంటూ ఈ విషయం తెలిసిన కొంత మంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.