బుల్లితెరపై బిగ్బాస్ రియాల్టీకి షోకు చాలా మంది అభిమానులు ఉన్నారు. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఈ షో విజయవంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే అన్ని భాషలలోనూ చాలా సీజన్స్ కంప్లీట్ కాగా.. ప్రస్తుతం తెలుగులో సీజన్ 8 రన్ అవుతుంది.
సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ షోకు అక్కినేని
నాగార్జున హోస్టింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్
హౌస్ లోకి అడుగుపెట్టగా తొలివారం నామినేషన్స్ ప్రక్రియ జరుగుతుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు తమిళంలోనూ బిగ్బాస్ సీజన్ 8 స్టార్ట్ కానుంది. అయితే మొదటి నుంచి అంటే 2017 నుంచి ఈ షోకు లోకనాయకుడు కమల్ హాసన్ హోస్టింగ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ షో నుంచి తప్పుకున్నారు కమల్. ప్రస్తుతం చేతి నిండా సినిమాలు, షూటింగ్స్ అంటూ బిజీగా ఉండడంతోనే కమల్ ఈ షో నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది.దీంతో కొత్త
బిగ్ బాస్ షోకి ఎవరు హోస్ట్ గా వ్యవహరిస్తారనే ప్రశ్న తలెత్తింది. కమల్ స్థానంలోకి
కోలీవుడ్ హీరో శింబు వస్తాడని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ తర్వాత
హీరో విజయ్ సేతుపతి పేరు వినిపించింది. తాజాగా బిగ్బాస్ సీజన్ 8 హోస్టింగ్ పై అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్.
తమిళ్ బిగ్ బాస్ ఫ్యాన్స్ కు నిర్వాహకులు షాక్ ఇచ్చారు. త్వరలో మొదలయ్యే సీజన్ 8 కి కమల్ హాసన్ స్థానంలో
విజయ్ సేతుపతి హోస్టింగ్ చేస్తారని ప్రకటించారు. పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న కారణంగా కమల్ తప్పుకున్నట్లు వెల్లడించారు. దీంతో కమల్ స్థానాన్ని
విజయ్ సేతుపతి ఏ విధంగా భర్తీ చేస్తారోనన్న ఆసక్తినెలకొంది. కాగా
విజయ్ సేతుపతి గతంలో
మాస్టర్ చెఫ్
తమిళ్ కు కూడా హోస్టుగా వ్యవహరించారు.తమిళం బిగ్బాస్ సీజన్ 8కు మక్కల్ సెల్వన్
విజయ్ సేతుపతి హోస్టింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేశారు. తాజాగా విడుదలైన ప్రోమోలో
విజయ్ సేతుపతి మరింత స్టైలీష్ గా కనిపించారు. అలాగే బిగ్బాస్ షో లోగో కూడా అభిమానులను ఆకట్టుకునేలా డిజైన్ చేశారు.బిగ్ బాస్
తమిళ్ 8
అక్టోబర్ నెలలో ప్రారంభం కానుంది.