మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా కాలం తర్వాత యంగ్ టైగర్ ఊర మాస్ అవతారంలో కనిపించనుండడంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే విడుదలకు ముందే ఈ సినిమా భారీ సంచలనాలను క్రియేట్ చేస్తోంది. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయం కాబోతుంది జాన్వీ. అలాగే ఈ చిత్రంలో మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతి నాయకుడిగా కనిపించనున్నారు. ‘దేవర’ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘ఫియర్ సాంగ్..’, ‘చుట్టమల్లె..’ సాంగ్స్ ఆకట్టుకున్నాయి. అంతే కాకుండా టీజర్, పాటలు సినిమాపై ఉన్న అంచనాలను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లాయి. మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్ దర్శకుడు అనిరుద్ రవిచందర్ కూడా దేవర సాంగ్స్ గురించి వరుస పోస్ట్ తో హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్రం నుంచి ‘దావుడి..’ అనే వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఇక ఎప్పటిలాగే ఎన్టీఆర్ డాన్స్ అదరగొట్టేశారు. ముఖ్యంగా దావుడి పాటలో స్టైలీష్ డ్యాన్స్ స్టెప్పులతో అభిమానులను ఊర్రుతలూగించారు.
ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్‌తో అదుర్స్ అనిపించారు. అటు తారక్ తో పోటీపడి మరీ స్టెప్పులు అదరగొట్టేసింది హీరోయిన్ జాన్వీ కపూర్. ఈ పాటలో వీరిద్దరి కెమిస్ట్రీ ఆకట్టుకుంది.
ఇదిలావుండగా దేవర నుంచి తాజాగా రిలీజ్ అయిన దావూదీ సాంగ్ లో ఎన్టీఆర్ స్టెప్పులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అయితే ఆ స్టెప్స్ చిత్రీకరణ సమయంలో ఎన్టీఆర్ కండరాల నొప్పులు గాయాలతో బాధపడ్డారని ఆ మూవీ సినిమా ఆటోగ్రాఫర్ రత్న వేలు సోషల్ మీడియాలో తెలిపారు. అంత నొప్పిలోనూ తారక్ చాలా అలవోకగా డాన్స్ వేశారు. ఆయనకు హ్యాట్సాఫ్ అని పోస్ట్ చేశారు.అనిరుద్ కంపోజ్ చేసిన ట్యూన్ ప్రతీ ఒక్కరినీ డాన్స్ చేసేలా చేస్తోది. ఇన్‌స్టెంట్ చార్ట్ బస్టర్‌గా నిలిచిన ఈ పాట మిగిలిన పాటలపై ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింత పెంచేసింది. దేవర చిత్రానికిై అనిరుద్ అద్భుతమైన సంగీతాన్ని అందించినట్లుగా ఇప్పటివరకు విడుదలైన సాంగ్స్ చూస్తే తెలుస్తోంది. దేవరలో దావుడి సాంగ్‌ను వావ్ అనిపించేలా కంపోజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి తెలుగులో రాసిన ఈ పాటను తమిళంలో విఘ్నేష్ శివన్, హిందీలో కౌసర్ మునీర్, కన్నడలో వరదరాజ్ చిక్‌బల్లాపుర, మలయాళంలో మాన్‌కొంబు గోపాలకృష్ణ రాశారు. ‘దేవర: పార్ట్ 1’ను తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నారు.