తెలుగు సినీ పరిశ్రమలో ఒకానొక సమయంలో స్టార్
డైరెక్టర్ గా కెరీర్ ను కొనసాగించిన దర్శకులలో
పూరి జగన్నాథ్ ఒకరు. ఈయన కొన్ని సంవత్సరాల క్రితం వరుస పెట్టి
బ్లాక్ బస్టర్ విజయాలను
బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. దానితో ఈయన
టాలీవుడ్ ఇండస్ట్రీలోనే టాప్ డైరెక్టర్లలో ఒకరిగా మారిపోయాడు. ఇక ఈయన ఈ మధ్య కాలంలో దర్శకత్వం వహించిన సినిమాలు ఏవి కూడా పెద్ద స్థాయిలో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకోవడం లేదు. ఆఖరుగా ఈయన దర్శకత్వంలో రూపొందిన
ఇస్మార్ట్ శంకర్ మూవీ మంచి విజయాన్ని అందుకుంది.
వరుసగా
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సినిమాలు ఫ్లాప్ అవుతూ రావడంతో తెలుగులో
పూరి జగన్నాథ్ కి పెద్దగా ఆఫర్లు రావడం లేదు అని ఓ వార్త వైరల్ అవుతుంది. ఇక ఈయన కూడా తెలుగులో కాకుండా
హిందీ లో తన ప్రయత్నాలను మొదలు పెట్టినట్లు అందులో భాగంగా ఏకంగా
బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి
సల్మాన్ ఖాన్ కి ఓ కథ చెప్పినట్లు , అది నచ్చడంతో
సల్మాన్ ,
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో
సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ గా మారింది.