తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి బాలకృష్ణ , టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల పాటు టాప్ డైరెక్టర్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగించిన బి గోపాల్ కాంబోలో అనేక మూవీలు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. వీరి కాంబోలో మొదట లారీ డ్రైవర్ అనే మూవీ వచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత రౌడీ ఇన్ స్పెక్టర్ మూవీ వచ్చింది. ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత సమరసింహా రెడ్డి మూవీ వచ్చింది. ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత నరసింహ నాయుడు సినిమా వచ్చింది.
ఆ సినిమా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. వీరి కాంబోలో ఐదవ మూవీ గా పలనాటి బ్రహ్మనాయుడు అనే సినిమా రూపొందింది. ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇకపోతే బాలకృష్ణ హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం హర హర మహాదేవ అనే టైటిల్ తో ఓ మూవీ ప్రారంభం కాబోతున్నట్లు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. కానీ ఆ తర్వాత ఆ సినిమా స్టార్ట్ కాలేదు. తాజాగా బి గోపాల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా బాలకృష్ణ హీరోగా హర హర మహాదేవ సినిమా ఎందుకు షూటింగ్ స్టార్ట్ కాలేదు అనే వివరాలను తెలియజేశాడు. బి గోపాల్ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ ... బాలకృష్ణ హీరోగా ఒక సినిమా చేయాలి అనుకున్నాను.
కానీ అప్పటికి కథ సిద్ధంగా లేదు. బెల్లంకొండ సురేష్ ఆ సినిమాను నిర్మించాలి అనుకున్నాడు. దానితో సురేష్ ఒక కథ ఉంది దానితో సినిమా చేద్దాం అన్నాడు. దానితో హర హర మహాదేవ అనే టైటిల్ ను ఫిక్స్ చేసుకున్నాం. కానీ ఆ తర్వాత అతను కథ వినిపించలేదు. దానితో చిన్ని కృష్ణ దగ్గర ఒక కథ ఉంది అంటే దానిని కూడా విన్నాము. అది కూడా పెద్దగా నచ్చలేదు. దానితో కథ లేకపోవడం వల్ల హరహర మహాదేవ సినిమాను ఆపివేయాల్సి వచ్చింది అని బి గోపాల్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.