వారంలో అంతశాతం రికవరీ.. హిట్ స్టేటస్కు అన్ని కోట్ల దూరంలో సరిపోదా శనివారం..!

frame వారంలో అంతశాతం రికవరీ.. హిట్ స్టేటస్కు అన్ని కోట్ల దూరంలో సరిపోదా శనివారం..!

Pulgam Srinivas
నాని హీరోగా రూపొందిన సరిపోదా శనివారం సినిమా మంచి అంచనాలు నడుమ ఆగస్టు 29 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో సూపర్ సాలిడ్ కలెక్షన్లను ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వసూలు చేస్తుంది. ఇకపోతే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 7 రోజుల్లో ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ సినిమాకు నైజాం ఏరియాలో 10.54 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 2.94 కోట్లు , ఉత్తరాంధ్రలో 2.74 కోట్లు , ఈస్ట్ లో 1.49 కోట్లు , వెస్ట్ లో 98 లక్షలు , గుంటూరులో 1.35 కోట్లు , కృష్ణ లో 1.38 కోట్లు , నెల్లూరు లో 88 లక్షల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా 7 రోజుల్లో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 22.32 కోట్ల షేర్ , 35.90 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ కి 7 రోజుల్లో కర్ణాటక , తమిళనాడు మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 5.90 కోట్ల కలెక్షన్లు రాగా , ఓవర్సీస్ లో 10.85 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా 7 రోజులకు గాను ఈ మూవీ కి ప్రపంచవ్యాప్తంగా 39.07 కోట్ల షేర్ , 71.85 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 41 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇక ఈ మూవీ మరో 2.93 కోట్ల షేర్ కలక్షన్లను రాబట్టినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: