దేవర ర్యాంపేజ్ స్టార్ట్.. రెండు నిమిషాల్లోనే అక్కడ టికెట్లన్నీ సేల్..!

frame దేవర ర్యాంపేజ్ స్టార్ట్.. రెండు నిమిషాల్లోనే అక్కడ టికెట్లన్నీ సేల్..!

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆయనకు ఉన్న స్టార్ స్టామినా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీలలో హీరోగా నటించి తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుతమైన స్థాయిని సంపాదించుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుండగా అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 27 వ తేదీన భారీ ఎత్తున థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడిన నేపథ్యంలో ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన టికెట్ బుకింగ్స్ కూడా కొన్ని ప్రాంతాలలో ఓపెన్ అయ్యాయి. ముఖ్యంగా ఈ మూవీ టికెట్ బుకింగ్స్ ఇప్పటికే ఓవర్సీస్ లో ఓపెన్ కావడం , అక్కడ ఈ మూవీ యొక్క టికెట్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించడం జరుగుతుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన టికెట్ బుకింగ్స్ డల్లాస్ లో ఓపెన్ అయ్యాయి.

ఇక డల్లాస్ లో ఈ మూవీ ప్రీమియర్స్ టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా కేవలం రెండు నిమిషాల్లోనే డల్లాస్ లోని ఈ మూవీ ప్రీమియర్ సేల్స్ టికెట్స్ మొత్తం బుక్ అయ్యాయి. దానితోనే అర్థం అవుతుంది డల్లాస్ లోని ప్రేక్షకులు దేవర మూవీ గురించి ఎంత ఆత్రుతగా ఎదురు చూస్తున్నారా అనేది. ఇక ఈ మూవీ కి గనుక హిట్ టాక్ వస్తే అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేయడం ఖాయంగా కనబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: