ఏంటి శోభిత ధూళిపాళ్ల నిజంగానే పెళ్లి కాకుండానే తల్లి కాబోతుందా.. ఆమె మాట్లాడిన మాటల్లో ఎంత నిజం ఉంది..పెద్దింటికి కోడలు కాబోతున్న శోభిత దూళిపాళ్ల మాటల్లో ఉన్న అంతరార్థం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. తెలుగు బ్యూటీ శోభిత దూళిపాళ్ల త్వరలోనే అక్కినేని ఫ్యామిలీలోకి కోడలుగా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇప్పటికే వీరి బంధం ఎంగేజ్మెంట్ తో అఫీషియల్ అయిపోయింది. ఇక ప్రస్తుతం పెళ్లికి టైం ఉన్నప్పటికీ నాగచైతన్య శోభిత మాత్రం డేటింగ్ లో ఉన్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో శోభిత ధూళిపాళ్ల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. జీవితంలో మహిళలు ఏదైనా సాధించాలంటే వారికి భర్తల సహకారం అండదండలు ఖచ్చితంగా కావాలి.వారి సహకారం ఉంటేనే మహిళలు ఏదైనా చేయగలరు. ఇక నా లైఫ్ లో కూడా నా భర్త పాత్ర ఉంటుందని నేను భావిస్తున్నాను.
అలాగే రిలేషన్ ఏదైనా సరే భయపడకుండా బయటపెట్టాలి.అందుకే నా రిలేషన్ ని బయటపెట్టేసాను.అలాగే లైఫ్ లో పెద్ద లక్ష్యాన్ని ముందు పెట్టుకోవాలి. అలా అయితేనే లైఫ్ మీద మరింత ఆసక్తి పెరిగి ఏదో ఒకటి సాధించాలి అనే ఇంట్రెస్ట్ పెరుగుతుంది.ఇక త్వరలోనే నేను మాతృత్వాన్ని పొందాలి అనుకుంటున్నాను.. నా జీవితంలో ఏ విషయం అయినా నిజాయితీగా చెప్పాలి అనుకుంటా.. అందుకే ఈ విషయాన్ని బయట పెట్టాను.ఇక తల్లి కావడానికి నేను ఎలాంటి రూల్స్, రెగ్యులేషన్స్ పెట్టుకోను. ఎప్పుడైతే అప్పుడు అనే ఆలోచనలోనే ఉన్నాను.. అంటూ శోభిత ధూళిపాళ్ల చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
అంతేకాదు ఈమె మాటలు విన్న కొంతమంది నెటిజన్స్ అయితే శోభిత స్పీడ్ చూస్తుంటే పెళ్లి కాకుండానే తల్లి అయ్యేలా ఉంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి శోభిత ధూళిపాళ్ల పెళ్లి కాకుండానే తల్లి అవ్వాలనుకుంటుందా.. ఆమె ఉద్దేశం ఏంటో తెలియాల్సి ఉంది.ఎందుకంటే నాగచైతన్య, నాగార్జునలు పెళ్లికి కాస్త సమయం ఉంది అని చెప్పారు. కానీ శోభిత అలా మాట్లాడేసరికి అందరిలో కొత్త అనుమానాలు మొదలయ్యాయి.