మొదటిరోజు ఓటీటీ లో రికార్డు సృష్టించిన డబల్ ఇస్మార్ట్.. ఈ రెస్పాన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చుంటే బ్లాక్ బస్టర్..?

frame మొదటిరోజు ఓటీటీ లో రికార్డు సృష్టించిన డబల్ ఇస్మార్ట్.. ఈ రెస్పాన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చుంటే బ్లాక్ బస్టర్..?

Pulgam Srinivas
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని తాజాగా డబల్ ఇస్మార్ట్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ కావ్య దాపర్ హీరోయిన్గా నటించగా ... డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ మూవీ ని పూరి జగన్నాథ్ తో పాటు ఛార్మి కలిసి సంయుక్తంగా నిర్మించారు. సంజయ్ దత్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించగా ... షియాజే షిండే , అలీ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ఒకే సారి విడుదల అయ్యింది.

ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే నెగటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి పెద్ద స్థాయిలో కలెక్షన్లు రాలేదు. చివరగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అల్లరించడంలో విఫలం అయిన ఈ సినిమా తాజాగా ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ కి ఓ టి టి ప్లాట్ ఫామ్ లో మాత్రం సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కేవలం 24 గంటల్లో 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను దక్కించుకున్నట్లు సమాచారం.

ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన డబల్ ఇస్మార్ట్ మూవీ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో మాత్రం ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించాడు. మణిశర్మ అందించిన సంగీతం ఈ సినిమాకు కాస్త ప్లస్ అయింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ram

సంబంధిత వార్తలు: