అదిరిపోయే ప్లానింగ్ తో ముందుకెళుతున్న బుచ్చిబాబు.. స్టార్ట్ అయితే ఆగేదే లేదు..?

frame అదిరిపోయే ప్లానింగ్ తో ముందుకెళుతున్న బుచ్చిబాబు.. స్టార్ట్ అయితే ఆగేదే లేదు..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో బుచ్చిబాబు సన ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభించిన కొత్తలో ప్రస్తుత టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి సుకుమార్ దగ్గర పని చేశాడు. ఆ తర్వాత ఈయన పంజా వైష్ణ వ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్గా ఉప్పెన అనే మూవీ ని తెరకెక్కించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో దర్శకుడిగా బుచ్చిబాబు కి మంచి గుర్తింపు లభించింది. ఈ మూవీ తర్వాత ఈయన ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నాడు అని అనేక వార్తలు వచ్చాయి. కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ బుచ్చిబాబు , ఎన్టీఆర్ కాంబో మూవీ సెట్ కాలేదు.

ఇక ఆ తర్వాత ఈయన రామ్ చరణ్ తో సినిమా సెట్ చేసుకున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ , బుచ్చిబాబు కాంబో మూవీ కి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుండగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతం అందించబోతున్నాడు. కన్నడ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి శివరాజ్ కుమార్ ఈ మూవీ లో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ అనౌన్స్మెంట్ వచ్చి చాలా కాలమే అవుతున్న ఇంకా ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లో చరణ్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నట్లు దానితో చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సినిమా కోసం తన లుక్ ను పూర్తిగా మారుస్తున్నట్లు తెలుస్తోంది.

చాలా కాలం నుండి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న బుచ్చిబాబు మరింత సమయం దొరకడంతో ఈ మూవీ స్క్రిప్ట్ ను మరింత బలంగా మారుస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్క సారి కనుక ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది అంటే జెట్ స్పీడ్ లో ఈ మూవీ షూటింగ్ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. అలా పక్క ప్లానింగ్ తో బుచ్చిబాబు ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: