సమంత ఆ స్టార్ హీరోతో నటించింది అంటే చాలు ఆ పాయింట్ కంపల్సరీ..?

frame సమంత ఆ స్టార్ హీరోతో నటించింది అంటే చాలు ఆ పాయింట్ కంపల్సరీ..?

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఒకరు అయినటువంటి సమంత ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక సమంత తన కెరీర్లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో ఏకంగా నాలుగు సినిమాల్లో నటించింది. కానీ ఈ నాలుగు సినిమాల్లో కూడా కామన్ గా మరో పాయింట్ జరిగింది. అది ఏమిటి అనే వివరాలను తెలుసుకుందాం.

సమంత , జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో బృందావనం , జనతా గ్యారేజ్ , రామయ్య వస్తావయ్య , రభస ఇలా నాలుగు సినిమాలు వచ్చాయి. ఈ నాలుగు మూవీలలో బృందావనం , జనతా గ్యారేజ్ సినిమాలు మంచి విజయాలను అందుకోగా , రామయ్య వస్తావయ్య , రభస సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యాయి. కానీ ఈ నాలుగు సినిమాల్లో మాత్రం ఓ పాయింట్ కామన్ గా ఉంటుంది అదేమిటో తెలుసుకుందాం. సమంత , జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో రూపొందిన బృందావనం సినిమాలో సమంత తో పాటు కాజల్ అగర్వాల్ కూడా హీరోయిన్ గా నటించింది. వీరిద్దరి కాంబో లో రూపొందిన జనతా గ్యారేజ్ సినిమాలో సమంత తో పాటు నిత్యా మీనన్ కూడా హీరోయిన్ గా నటించింది. 

అలాగే వీరి కాంబో లో రూపొందిన రామయ్య వస్తావయ్య సినిమాలో సమంత తో పాటు శృతి హాసన్ కూడా హీరోయిన్ గా నటించింది. ఇక రభస సినిమాలో సమంత తో పాటు ప్రణీత కూడా హీరోయిన్ గా నటించింది. ఇలా వీరిద్దరి కాంబో లో రూపొందిన నాలుగు సినిమాల్లో కూడా సమంత తో పాటు మరో హీరోయిన్ నటించడం జరిగింది. ఇది ఇలా ఉంటే వీరి కాంబోలో వచ్చిన సినిమాల హిట్ , ఫ్లాప్ విషయాన్ని పక్కన పెడితే వెండి తెరపై వీరిద్దరి జంటకు మాత్రం ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి ప్రతి సారి మంచి రెస్పాన్స్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: