పాపం రకుల్.. సినిమాలు ఫ్లాప్.. అనవసరంగా ఆమెపై పడుతున్నారుగా..?

frame పాపం రకుల్.. సినిమాలు ఫ్లాప్.. అనవసరంగా ఆమెపై పడుతున్నారుగా..?

MADDIBOINA AJAY KUMAR
కొన్ని సినిమాల విషయంలో సినిమా హిట్ అయితే కొంత మందిని పొగడడం ... సినిమా ఫ్లాప్ అయితే వారి వల్లే సినిమా ఫ్లాప్ అయ్యింది అంటూ కొంత మంది పై నిందలు వేయడం జరుగుతుంది. కానీ సినిమా హిట్ అయిన , ఫ్లాప్ అయిన కూడా ఇది అందరి వల్ల జరిగిందే అవుతుంది. ఎందుకు అంటే సినిమా అనేది ఏ ఒక్కరి వల్ల పూర్తి కాదు. ఎంతో మంది టెక్నీషియన్స్ , నటులు అందరూ కలిస్తేనే సినిమా పూర్తి అవుతుంది. దానితో సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించిన , అట్టర్ ప్లాప్ అయిన దాని ఫలితాన్ని అందరూ కలిసి అనుభవించాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో రకుల్ నటించిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యాయి.

ఇక వాటితో ఈమె నటించిన సినిమాలకి అలాగే జరుగుతుంది అంటూ ఓ వార్త వైరల్ అయింది. అసలు ఎందుకు రకుల్ ఆ ప్లాప్ మూవీలలో ఫోకస్ అయ్యింది అనే వివరాలను తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాలు క్రితం రవితేజ హీరోగా ఇలియానా హీరోయిన్గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కిక్ మూవీ రూపొందింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ సినిమాకు కొనసాగింపుగా కిక్ 2 మూవీ ని రూపొందించారు. ఇందులో రవితేజ హీరోగా నటించిన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించింది. కొంత కాలం క్రితం నాగార్జున హీరోగా రూపొందిన మన్మధుడు సినిమా అద్భుతమైన విజయం అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి కొనసాగింపుగా మన్మధుడు 2 మూవీ ని రూపొందించారు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారతీయుడు మూవీ అద్భుతమైన విజయం అందుకుంది.

తాజాగా ఈ మూవీ కి కొనసాగింపుగా భారతీయుడు 2 మూవీ ని రూపొందించారు. ఇందులో రకుల్ ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఇక ఈ మూవీల మొదటి భాగాలు అద్భుతమైన విజయాలు సాధించడం , రెండవ భాగాలు ఫ్లాప్ కావడంతో రకుల్ నటించిన ఏ సీక్వెల్ మూవీ అయిన ఫ్లాప్ కావాల్సిందే అంటూ ఓ వార్త వైరల్ అయింది. మరి ఈమె వల్లే ఆ సినిమా ఫ్లాప్ అయ్యిందా..? ఈమె కాకుండా వేరే వాళ్ళు ఉండుంటే ఆ మూవీలు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించేవా ..? ఒక సినిమా ఫ్లాప్ అయ్యింది అంటే ఒక నటి ఏమి చేస్తుంది అని పలువురు రకుల్ సైడు మాట్లాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: