రియల్ హీరో అనన్య నాగళ్ల.. అందరికంటే ఆమె గ్రేట్..?

frame రియల్ హీరో అనన్య నాగళ్ల.. అందరికంటే ఆమె గ్రేట్..?

praveen
• తెలుగు రాష్ట్రాల్లో వరదలు
• వరదల్లో ఆపద్బాంధవులుగా నిలుస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు
• అందరికంటే అనన్య నాగళ్ల గ్రేట్
( ఏపీ, తెలంగాణ - ఇండియా హెరాల్డ్)
మొత్తం సినీ విరాళాల ప్రకటనల్లో అనన్య నాగళ్ల ప్రకటన చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఆమె ఎంత మనీ డొనేట్ చేసిందనేది ఇక్కడ ముఖ్యం కాదు. తన రేంజ్‌ చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఆ రేంజ్‌లో ఉన్నవారు డబ్బులు సేవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. తమ స్థాయి అంత డబ్బులు డొనేట్ చేసే అంత స్తోమత తమకు లేదని ఊరుకుంటారు. ఎవరైనా సరే అలాగే ఆలోచిస్తారు కానీ అనన్య నాగళ్ల తన స్వార్థం చూసుకోకుండా వరద బాధితులకు కష్టకాలంలో ఆదుకోవడానికి ముందుకు వచ్చి అందరి చేత రియల్ హీరో అని ప్రశంసలు పొందింది.
వకీల్ సాబ్ ఫేమ్ అనన్య నాగళ్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు తన మద్దతు తెలిపారు. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు వచ్చాయి కాబట్టి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అనన్య తన పోస్ట్ లో ఈ రెండు రాష్ట్రాలు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. అనన్య ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధులకు ప్రతి రాష్ట్రానికి రూ.2.5 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. వరదల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు ప్రభుత్వాలు చేస్తున్న సహాయక చర్యలకు ఇతరులు కూడా సహాయం చేయాలని ఆమె అభిమానులను కోరారు.
అనన్య సోషల్ మీడియాలో 'వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలందరూ ఈ ప్రకృతి విపత్తు నుంచి త్వరగా కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను. నా వంతుగా, నేను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధులకు ప్రతి రాష్ట్రానికి రూ. 2.5 లక్షలు విరాళంగా ఇస్తున్నాను.' అని రాసింది. ఆమె చేసిన ఈ విరాళాన్ని చాలామంది మెచ్చుకున్నారు. ఆమె అభిమానులు ఈ కష్ట కాలంలో ఆమె సహాయం చేయడంపై ఆమెను ప్రశంసించారు. ఇకపోతే చాలా స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ఆకలితో ఆలమటిస్తున్న వరద బాధితులకు అన్నలు నిత్యవసర సరుకులు అందజేస్తూ తమ మంచి మనసున్న చాటుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: