బాలయ్య.. కెఎస్ రవికుమార్ కాంబోలో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

frame బాలయ్య.. కెఎస్ రవికుమార్ కాంబోలో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి బాలయ్య , తమిళ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి కే ఎస్ రవి కుమార్ కాంబోలో జై సింహా , రూరల్ అనే రెండు మూవీలు రూపొందాయి. ఇందులో జై సింహ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించగా , రూలర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే ఈ రెండు మూవీ ల కంటే ముందే బాలయ్య , కే ఎస్ రవికుమార్ కాంబోలో ఓం మూవీ మిస్ అయింది. ఆ సినిమా ఏది ..? ఎందుకు ఆ మూవీ మిస్ అయింది అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా కె ఎస్ రవి కుమార్ దర్శకత్వంలో కథానాయకుడు అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ తెలుగు వర్షన్ లో రజనీ కాంత్ కి ఫ్రెండ్ పాత్రలో జగపతి బాబు నటించాడు. ఇకపోతే మొదట కే ఎస్ రవి కుమార్ ఈ సినిమాలో రజనీ కాంత్ కు ఫ్రెండ్ పాత్రలో జగపతి బాబు ను కాకుండా బాలకృష్ణ ను అనుకున్నాడట. అందులో భాగంగా బాలకృష్ణ కు కథను కూడా వివరించాడట. బాలకృష్ణ కు కథ బాగా నచ్చడంతో రజనీ కాంత్ కి ఫ్రెండ్ పాత్ర చేయడానికి ఆయన అంగీకరించాడట. కానీ రజనీ కాంత్ ఒక సారి బాలకృష్ణ కు ఫోన్ చేసి నువ్వు నా సినిమాలో నాకు ఫ్రెండ్ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నావని తెలిసింది. 

కాకపోతే ఆ పాత్ర చాలా సాఫ్ట్ గా ఉంటుంది. అది నువ్వు చేయడం వల్ల దాంట్లో కొన్ని మాస్ యాంగిల్స్ చేర్చవలసి ఉంటుంది. దాని వల్ల ఆ పాత్ర చెడిపోయే అవకాశం ఉంటుంది. అది నీ ఈమేజ్ కి సరిపోయే పాత్ర కూడా కాదు అది చేయకు అని చెప్పాడట. దానితో బాలకృష్ణ కూడా రజనీ కాంత్ చెప్పిన మాటలకు కన్విన్స్ అయ్యి ఆ సినిమా చేయలేదట. అలా చాలా కాలం క్రితమే కే ఎస్ రవికుమార్ , రజనీకాంత్ హీరోగా రూపొందిన సినిమాలో బాలకృష్ణ ను తీసుకోవాలి అనుకున్న అలా ఆ మూవీ మిస్ అయ్యిందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: