మహేష్ మూవీతో ఒక్కసారిగా పెరిగిన దర్శకుడి క్రేజ్.. దెబ్బకి అంతా డిమాండ్..?

frame మహేష్ మూవీతో ఒక్కసారిగా పెరిగిన దర్శకుడి క్రేజ్.. దెబ్బకి అంతా డిమాండ్..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో అపజయాలు లేకుండా అద్భుతమైన స్థితిలో కెరియర్ను ముందుకు సాగిస్తున్న దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాలకు కథలను అందించాడు. ఇక కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన పటాస్ మూవీ తో దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించిన ఈ దర్శకుడు ఈ మూవీతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సుప్రీమ్ , రాజా ది గ్రేట్ , ఎఫ్ 2 , సరిలేరు నీకెవ్వరు , ఎఫ్ 3 , భగవంత్ కేసరి ఇలా అన్ని సినిమాలు మంచి విజయాలను సాధించడంతో ప్రస్తుతం ఈ దర్శకుడికి టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉంది.

ప్రస్తుతం అనిల్ రావిపూడి , విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా దిల్ రాజు నిర్మాతగా రూపొందుతున్న సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈయన కెరియర్ను ప్రారంభించిన కొత్తలో చాలా తక్కువ రెమ్యూనరేషన్ కే సినిమాలు చేస్తూ వచ్చినట్లు , ఆ తర్వాత మహేష్ బాబు సినిమాతో ఈయన తన రెమ్యూనరేషన్ భారీగా పెంచినట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... మహేష్ బాబు హీరోగా రూపొందిన సరిలేరు నీకెవ్వరు సినిమా కంటే ముందు అనిల్ రావిపూడి మూవీ కి రెండు , మూడు కోట్లు మాత్రమే రెమ్యూనిరేషన్ తీసుకునేవాడు అని , మహేష్ బాబు హీరోగా రూపొందిన సరిలేరు నీకెవ్వరు మూవీ కోసం 15 కోట్ల రెమ్యూనిరేషన్ పుచ్చుకున్నట్లు , ఇక ఆ తర్వాత కూడా ఈ దర్శకుడికి వరస సక్సెస్ లు దక్కుతూ ఉండడంతో ఏకంగా ప్రస్తుతం ఈ దర్శకుడు సినిమాకు 25 కోట్ల వరకు రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇలా ఒక్క సారిగా మహేష్ మూవీ నుండి ఈయన డిమాండ్ అదిరిపోయే రేంజ్ లో పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: