దసరా దరిదాపుల్లోకి కూడా రాలేకపోయిన సరిపోదా శనివారం.. హాయ్ నాన్న పరిస్థితి ఇది..?

frame దసరా దరిదాపుల్లోకి కూడా రాలేకపోయిన సరిపోదా శనివారం.. హాయ్ నాన్న పరిస్థితి ఇది..?

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. పోయిన సంవత్సరం నాని మొదట దసరా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కీర్తి సురేష్ ఈ మూవీ లో హీరోయిన్గా నటించగా , శ్రీకాంత్ ఓదెలా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు విడుదల అయిన వారం రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 38.21 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్లు వచ్చాయి. అలా దసరా మూవీ విడుదల అయిన మొదటి వారం రోజుల్లో అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టింది.

ఇకపోతే నాని హీరోగా రూపొందిన హాయ్ నాన్న సినిమా పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల అయింది. ఈ మూవీ కూడా అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో నాని కి జోడిగా నటించగా , శౌర్యవ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే మొదటి వారం రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి హి నాన్న సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 15.8 కోట్ల షేర్ కలక్షన్లను వసూలు చేసింది. తాజాగా నాని "సరిపోదా శనివారం" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించగా ... వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ ఆగస్టు 29 వ తేదీన విడుదల అయింది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వారం రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. మొదటి వారం రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 22 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్లు వచ్చాయి. ఇక నాని ఆఖరి మూడు మూవీల విషయానికి వస్తే దసరా మూవీ మొదటి వారం రోజుల్లో అత్యధిక కలెక్షన్లను వసూలు చేయగా , సరిపోదా శనివారం రెండవ స్థానంలోనూ , హాయ్ నాన్న సినిమా మూడవ స్థానంలోనూ నిలిచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: