సిమ్రాన్ ని లైంగికంగా వేధించిన హీరో.. ఎవరంటే.?

frame సిమ్రాన్ ని లైంగికంగా వేధించిన హీరో.. ఎవరంటే.?

Pandrala Sravanthi
ఒక్క హీరోయిన్ బయటికి వచ్చి నోరు విప్పితే అందరూ ఆమెకు సపోర్ట్ గా వచ్చి నిలబడతారు అన్నదానికి ప్రస్తుతం  మాలీవుడ్లో హేమ కమిటీ రిపోర్ట్ ఉదాహరణ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే హేమ కమిటీ రిపోర్ట్ ద్వారా ఎంతో మంది నటీమణులు బయటికి వచ్చి వాళ్ళు అనుభవించిన లైంగిక వేధింపులకు సంబంధించిన విషయాలు బయట పెడుతున్నారు. ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు ఈ విషయాలు బయటపెడుతున్న వేళ తాజాగా సీనియర్ నటి సిమ్రాన్ నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం సిమ్రాన్ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవ్వడం తో సిమ్రాన్ ని వేధించింది ఎవరు అని చాలామంది నెటిజన్స్ సెర్చ్ చేస్తున్నారు. 

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో సిమ్రాన్ మాట్లాడుతూ.. చాలా మంది లైంగిక వేధింపులు ఎదుర్కోవడంతోనే ఎందుకు ఈ విషయాన్ని బయటపెట్టారు అని అంటూ ఉంటారు.కానీ అలాంటి విషయాన్ని అంత తొందరగా ఎవరు బయట పెట్టలేరు. మన చుట్టూ ఏం జరుగుతుంది అని తెలుసుకునే లోపే తప్పు జరిగిపోతుంది. వాటి గురించి సహనం పాటించి బయటపెట్టాలి. చిన్న వయసులో ఉన్నప్పుడు నేను కూడా ఇలాంటివి ఎదుర్కున్నాను. కానీ ఆ విషయాలు చెప్పడానికి ఇప్పుడు అనువైన సమయం కాదు.

  అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది సిమ్రాన్. ఇక ఇండస్ట్రీ లోకి సిమ్రాన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఓ హీరో చేత లైంగిక వేధింపులకు  గురైంది అనే మ్యాటర్ అప్పట్లో సౌత్ ఇండస్ట్రీలో కలకలం సృష్టించింది. అయితే ఈ విషయం మీడియాలో వైరల్ అయినప్పటికీ ఆ హీరో ఎవరు..అసలు అది నిజంగానే జరిగిందా లేక రూమరా అనేది మాత్రం బయటపడలేదు.. ఇక తెలుగులో సిమ్రాన్ వెంకటేష్, నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో జతకట్టి ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో హీరోయిన్ గా చేసింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: