మరిన్ని యాక్షన్ సీన్స్ తో ఓటీటీ లోకి వచ్చేస్తున్న గోట్..!?

frame మరిన్ని యాక్షన్ సీన్స్ తో ఓటీటీ లోకి వచ్చేస్తున్న గోట్..!?

Anilkumar
విజయ్ నటించిన లేటెస్ట్ సినిమా గోట్.  ఈ చిత్రానికి ఇప్పటికే దారుణమైన విమర్శలు వచ్చాయి. విజయ్ లుక్స్ మీద ట్రోలింగ్ జరిగింది. ఈ మూవీ సాంగ్స్ మీదా విమర్శలు వచ్చాయి. ట్రైలర్‌లోని కంటెంట్, విజువల్స్ బాగానే అనిపించినా.. విజయ్‌ని చూపించిన తీరుకు అంతా పెదవి విరిచారు. సాంగ్స్ మీద వచ్చిన ట్రోలింగ్‌తో సినిమాలో లుక్స్‌ను బెటర్ చేశామని వెంకట్ ప్రభు చెబుతూనే వస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్లలో మిశ్రమ స్పందనతో నడుస్తుంది. ఇక ఇందులో విజయ్ తో పాటు, స్నేహా, మీనాక్షి చౌదరి, ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, అజ్మల్ అమీర్, జయరామ్, లైలా, వైభవ్, యోగి బాబు, ప్రేమి అమరెన్,

 యుగేంద్రన్ వంటి ప్రముఖ నటులు ప్రధాన పాత్రలలో నటించారు. ప్రస్తుతం మిశ్రమ స్పందనతో నడుస్తున్న ఈ చిత్రం, దీర్ఘకాలంలో బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి. ఇక ఈ సినిమా శాటిలైట్ హక్కులను జీ సంస్థ సొంతం చేసుకున్నట్లు సమాచారం. పైగా ఈ సినిమాను అక్టోబర్ 2 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసురానున్నట్లు కూడా టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు ఎలాగూ థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలన్నీ నెలలోపే ఓటీటీ లోకి వస్తున్నాయి. కాబట్టి ఈ సినిమా అదే తేదికి ఓటీటీ లోకి వచ్చిన ఆశ్చర్యం లేదు. థియేట్రికల్ రన్ పూర్తైన తర్వాత స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

ఈ సినిమా, థియేటర్‌లో మూడు గంటలు రెండు నిమిషాల నిడివితో ప్రదర్శించబడినప్పటికీ, ఓటీటీలో అదనపు యాక్షన్ సీన్లను చేర్చి, మొత్తం మూడు గంటల ఇరవై నిమిషాల నిడివితో స్ట్రీమ్ చేయనున్నారని ప్రచారం. విజయ్ అభిమానులకు ఇది మరింత ఉత్సాహం నింపే వార్త.ఇక రాజకీయాల్లో విజయ్ అడుగు పెట్టడం, మరో సినిమా చేసే అవకాశం లేదని ప్రచారం జరగడం... రీజన్స్ ఏవైనా 'ది గోట్' మీద తమిళనాడులో అంచనాలు పెరిగాయి. అయితే... తెలుగు రాష్ట్రాల్లో బజ్ అంతగా ఏర్పడలేదు. డీ ఏజింగ్ ఎఫెక్ట్ సీన్స్ మీద ట్రోల్స్ రావడం కావచ్చు, ట్రైలర్ అంత ఇంప్రెసివ్‌గా లేకపోవడం కావచ్చు... ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: