దేవర నుండి షాకింగ్ అప్డేట్.. !?

frame దేవర నుండి షాకింగ్ అప్డేట్.. !?

Anilkumar
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. బాలీవుడ్ నటులు జాన్వీ కపూర్ అలాగే సైఫ్ అలీఖాన్ లు తెలుగు సినిమాకి పరిచయం అవుతూ వస్తున్నా ఈ చిత్రంపై భారీ హైప్ ప్రస్తుతం నెలకొంది. అయితే ఈ సినిమా యూఎస్ ప్రీ సేల్స్ బుకింగ్స్ మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రీ సేల్స్ లో అక్కడ ఊహించని రెస్పాన్స్ ఈ చిత్రానికి వచ్చింది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ అరీస్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ సెప్టెంబర్ 27న గ్రాండ్ గా సినిమా రిలీజ్

 కాబోతుంది. మరోవైపు దేవర నుంచి ‘దావుదీ’ అంటూ వచ్చిన ఈ మూడో సాంగ్ ఫుల్ జోష్‍తో ఉంది. ఎన్టీఆర్ డ్యాన్స్ ఇరగదీశారు. ఒకప్పటి వింటేజ్ ఎన్టీఆర్ కనిపించారు. ఫుల్ జోష్ ఉండే స్టెప్‍లతో దుమ్మురేపారు. హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా అదరగొట్టారు. మంచి గ్రేస్‍తో స్టెప్స్ వేశారు. ఈ పాట పక్కా డ్యాన్స్ నంబర్‌గా ఉంది. ఫాస్ట్ బీట్‍తో ఆకట్టుకునే ట్యూన్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్. దావుదీ సాంగ్ లిరికల్ వీడియోలా కాకుండా వీడియో సాంగ్‍నే మూవీ టీమ్ రిలీజ్ చేసింది.  అయితే తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా ఏకకాలంలో విడుదల కానున్న మూవీ ఇది.

విడుదలకి ఎక్కువ రోజులు టైం లేదు కాబట్టి.. ప్రమోషన్ డోస్ పెంచాల్సి ఉంది.  తాజాగా విడుదలైన ‘దావూదీ’ పాటకి మిశ్రమ స్పందన లభించింది.కాబట్టి ఆ నెగిటివిటీకి బ్రేకులు వేయాలంటే.. టీజర్, ట్రైలర్ వంటివి బయటకు వదలాలి. టీజర్ అయితే ఇక ఏమీ ఉండదట. డైరెక్ట్ గా ట్రైలర్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. వినాయక చవితి టైంకి ట్రైలర్ రెడీ అవుతుంది. ఆ తర్వాత తెలుగులో ఓ ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో ఇంటరాక్ట్ అవ్వాలని ‘దేవర’ బృందం భావిస్తుంది. ఐటీసీ కోహినూర్లో ఈ వేడుక జరిగే అవకాశం ఉందని అంటున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: