నితిన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. మగ బిడ్డకు జన్మనిచ్చిన షాలిని..!

frame నితిన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. మగ బిడ్డకు జన్మనిచ్చిన షాలిని..!

Divya
టాలీవుడ్ లో యంగ్ హీరో గా పేరు పొందిన నితిన్ వరుసగా సినిమాలలో నటిస్తూ హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా నటిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కు వీర అభిమాని అని ఎన్నోసార్లు తెలియజేశారు. 2020వ సంవత్సరంలో తన స్నేహితురాలు షాలినిని ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు హీరో నితిన్. నాగర్ కర్నూల్ ప్రాంతానికి చెందిన డాక్టర్ సంపత్ కుమార్, నూర్జహాన్ల కూతురే షాలిని. ఇప్పుడు తాజాగా ఈ జంట అభిమానులకు ఒక గుడ్ న్యూస్ తెలియజేసింది. పండంటి మగ బిడ్డకు తన భార్య జన్మనిచ్చిందంటూ హీరో నితిన్ తెలియజేశారు. ఈ విషయం తెలిసిన అభిమానులు సినీ సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా నితిన్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు.

మొదటిసారి నితిన్ జయం సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. తన సినీ కెరియర్ లో హిట్ల  కంటే ప్లాపులే ఎక్కువగా చవిచూశారు నితిన్. అయినా కూడా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఇప్పటికే పలు సినిమాలలో నటిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం తమ్ముడు అనే చిత్రంలో నటిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే డైరెక్టర్ వెంకీ కుడుముల డైరెక్షన్లో రాబిన్ హుడ్ చిత్రంలో కూడా నటిస్తూ ఉన్నారు నితిన్. గతంలో వీరి కాంబినేషన్లు భీష్మ సినిమా కూడా విడుదలయ్యింది ఇది మంచి విజయాన్ని అందించింది.

అయితే గత కొద్ది రోజుల నుంచి హీరో నితిన్ సినిమా షూటింగ్లకు కాస్త బ్రేక్ ఇచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు గల కారణం ఏమిటంటే తన భార్య కోసం నితిన్ ఈ పని చేసినట్లుగా ఇప్పుడు అర్థమవుతోంది. ఏది ఏమైనా నితిన్ అభిమానులకు ఇది ఒక గుడ్ న్యూస్ వంటిది చెప్పవచ్చు. మరి కొడుకు పుట్టిన వేలా విశేషం నితిన్ కెరీయర్ ఏ విధంగా కలిసొస్తుందో చూడాలి మరి. ప్రస్తుతం అందుకు సంబంధించి ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: