రాంచరణ్ ఫ్యాన్స్ కు తమన్ విజ్ఞప్తి.. ప్లీజ్ అలా చేయొద్దు అంటూ..!!

frame రాంచరణ్ ఫ్యాన్స్ కు తమన్ విజ్ఞప్తి.. ప్లీజ్ అలా చేయొద్దు అంటూ..!!

murali krishna
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. దాదాపు రెండేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది.రోజులు కాదు, నెలలు కాదు, ఏండ్లకేండ్లు వెయిట్ చేయడమంటే.. స్టార్ హీరోల అభిమానులకు కాస్త కష్టమే.అందులో మెగా ఫ్యాన్స్ అంటే.. ఆ లెక్క వేరేలా ఉంటుంది. పైగా శంకర్‌తో సినిమా అనగానే గాల్లో ఎగిరిగంతేశారు మెగాభిమానులు. అలాంటి సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడం.. వాళ్లకు నిజంగానే చిర్రెత్తెలా చేసింది. అసలు గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటి వరకు.. ఒకటి రెండు పోస్టర్స్‌, టైటిల్‌తో పాటు ఒక సాంగ్ మాత్రమే రిలీజ్ చేశారు. దీంతో.. గతంలోనే గేమ్ ఛేంజర్ అప్డేట్స్ కావాలని నెగిటివ్ ట్రెండ్ చేశారు ఫ్యాన్స్. కానీ ఈ సారి మాత్రం మేకర్స్‌కు గట్టిగానే ఇచ్చుకున్నారు. మాటల్లో చెప్పలేని, రాతల్లో రాయలేని విధంగా శంకర్‌తో పాటు నిర్మాణ సంస్థపై నెగెటివ్ ట్యాగ్స్‌ ట్రెండ్ చేస్తూ.. లిటరల్ గా చెప్పాలంటే బూతులు తిడుతూ పోస్టులు పెట్టారు. దీంతో.. మెగా ఫ్యాన్స్‌ కాస్త శాంతించండని.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇండైరెక్ట్‌గా ఒక పోస్ట్ పెట్టాడు.మీరు సినిమా అప్డేట్ కోసం చాలకాలంగా చూస్తున్నారని తెలుసు. కానీ మాకు మీ మద్దతు కావాలి. సినిమాలు, సమాజం కోసం చాలా చేసిన వారిని భాధించే హ్యాష్ ట్యాగ్ లు ట్రెండింగ్ చెయ్యొద్దు. ఇది నా విజ్ఞప్తి. లవ్ యూ ఆల్ అని పోస్ట్ చేసారు.ఇదిలా ఉండగా గేమ్ చేంజర్' మూవీకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది. ఇటీవలే హీరో కూడా తన పార్టును పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది.పొలిటికల్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందుతోన్న 'గేమ్ చేంజర్' మూవీని ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీన్ని నిర్మాత దిల్ రాజు కూడా కన్ఫార్మ్ చేశారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీని డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ చేస్తున్నారట. దీనిపై వినాయక చవితి సందర్భంగా అధికారిక ప్రకటన రాబోతుందని తెలిసింది.ఇదిలా ఉండగా.. 'గేమ్ చేంజర్' మూవీలో రామ్ చరణ్‌కు జంటగా కియారా అద్వాణీ నటిస్తోంది. ఈ పాన్ ఇండియా సినిమాలో శ్రీకాంత్, జయరాం, అంజలి, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీనికి థమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: