నాగార్జున పక్కన చేరిన నాని.. ఈ సంవత్సరం అలాంటి రికార్డ్..?

Pulgam Srinivas
ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా రూపొందిన నా సామి రంగ సినిమా థియేటర్లలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా మంచి అంచనాల నడుమ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ లో అల్లరి నరేష్ , రాజ్ తరుణ్ కీలక పాత్రలలో నటించగా ... ప్రముఖ డాన్స్ కొరియో గ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆశికా రంగనాథ్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది.

ఇకపోతే ఈ సినిమా విడుదల అయిన తర్వాత ఆరు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను రాబట్టింది. ఇది ఇలా ఉంటే తాజాగా నాచురల్ స్టార్ నాని సరిపోతా శనివారం అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించగా ... వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ప్రముఖ దర్శకుడు మరియు నటుడు అయినటువంటి ఎస్ జె సూర్య ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ ని డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">డి వి వి దానయ్య నిర్మించాడు.

మంచి అంచనాల నడుమ ఆగస్టు 29 వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇప్పటికే అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. ఇకపోతే ఈ సినిమా కూడా విడుదల అయిన 6 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను రాబట్టింది. ఇలా నాగార్జున హీరోగా రూపొందిన నా సామి రంగ , నాని హీరో గా రూపొందిన సరిపోదా శనివారం రెండు సినిమాలు కూడా ఈ సంవత్సరం విడుదల అయిన సినిమాలలో ఆరు రోజుల పాటు ఒక కోటి షేర్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్ట్ లో సరి సమాన స్థాయిలో నిలిచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: