నందమూరి నటసింహం
బాలకృష్ణ ప్రస్తుతం వరుస విజయాలతో అద్భుతమైన
జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఓ వైపు
బాలకృష్ణ సినిమాలు చేస్తూ విజయాలను అందుకుంటూ వస్తే మరో వైపు ఆయన అభిమానులు అంతా కూడా
బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ను
వెండి తెరకు పరిచయం చేయాలి అనే డిమాండ్ ను వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇక మోక్షజ్ఞ
సినిమా పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చే
మూవీ కి దర్శకులు వీరే అంటూ అనేక మంది దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. చివరగా
బాలకృష్ణ మాత్రం
యువ దర్శకుడు అయినటువంటి
ప్రశాంత్ వర్మ వైపు మొగ్గు చూపాడు.
ఇక ఇప్పటికే మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా
ప్రశాంత్ వర్మ తో చేయబోయే
సినిమా నుండి ఒక ఫస్ట్ లుక్
పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇది ఇలా ఉంటే
బాలకృష్ణ ఇంత కాలం పాటు కేవలం తన సినిమాలపై మాత్రమే ఇంట్రెస్ట్ పెడుతూ వచ్చాడు. తన సినిమాలేంటి , తన షూటింగ్లు ఏంటి , ఆ సినిమాలను ఎలా విజయం వైపు తీసుకువెళ్లాలి ఇలా ఆయన పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతూ వచ్చాడు. ఇక తన కుమారుడు కూడా
సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఎలాగో కొడుకుకు
సినిమా పరిశ్రమలో పెద్దగా సీనియార్టీ లేదు కాబట్టి
బాలకృష్ణ , మోక్షజ్ఞ
సక్సెస్ అయ్యేవరకు తనపై చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది.
కథల ఎంపిక విషయంలో , అలాగే అనేక విషయాలలో అతనికి ముందు జాగ్రత్త చర్యలు చూపిస్తూ ఉండాలి. దానితో
బాలయ్య , మోక్షజ్ఞ
సక్సెస్ అయ్యే వరకు తనతో పాటు తన కుమారుడి గురించి కూడా పట్టించుకోవలసి ఉంటుంది. అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా
బాలకృష్ణ , మోక్షజ్ఞ
సక్సెస్ అయ్యేవరకు డబల్ డ్యూటీ చేయాల్సిందే.
బాలకృష్ణ ప్రస్తుతం
బాబీ దర్శకత్వంలో "N B K 109" అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.