తెలుగు ఓటిటి అభిమానులకు గుడ్ న్యూస్.. ఈవారం ఏకంగా అన్ని సినిమాలు..?

frame తెలుగు ఓటిటి అభిమానులకు గుడ్ న్యూస్.. ఈవారం ఏకంగా అన్ని సినిమాలు..?

Pulgam Srinivas
ఈ వారం తెలుగు భాషలో అనేక సినిమాలు ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఆ సినిమాలు ఏవి ..? అవి ఏ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం.

డబల్ ఇస్మార్ట్ : రామ్ పోతినేని హీరోగా కావ్య దాపర్ హీరోయిన్గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మంచి అంచనాల నడుమ ఆగస్టు 15 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. తాజాగా ఈ మూవీ ప్రైమ్ వీడియో ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.

సింబ : ప్రస్తుతం ఈ మూవీ తెలుగు భాషలో ఆహా మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

భార్గవి నిలయం : ఈ సినిమా తెలుగు భాషలో ఆహా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

సత్య : ఈ సినిమా తెలుగు భాషలో ఆహా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

నింద : ఈ సినిమాలో వరుణ్ సందేశ్ హీరోగా నటించాడు. కొన్ని రోజుల క్రితం థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ తెలుగు భాషలో ఈటీవీ విన్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ott

సంబంధిత వార్తలు: