అక్కినేని ఫ్యామిలీలో చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ కి నాగ అనే పేరు కలిపి ఉంటుంది. అలా అక్కినేని నాగేశ్వరరావు,నాగార్జున, నాగ సుశీల, నాగచైతన్య ఇలా అందరి పేర్లలో నాగ అనే పేరు కామన్ గా ఉంది. అయితే చాలామందికి ఒక డౌట్ రావచ్చు వీరందరి పేరులో నాగ అనే పేరు ఎందుకు కామన్ గా ఉంది అని.. అయితే ఇలా నాగ అనే పేరు ఉండడం వెనుక ఒక భయంకరమైన సీక్రెట్ ఉందట.. అదేంటో ఇప్పుడు చూద్దాం.అక్కినేని నాగేశ్వరరావు పుట్టిన రోజే ఆయన తల్లికి ఒక భయంకరమైన కల వచ్చి తొందర మేలుకుందట.ఇక కలలో నాగుపాము కనబడిందట. దాంతో వెంటనే తనకి పుట్టిన బిడ్డకి నాగ అనే పేరు కలిసేలా నాగేశ్వరరావు అని పెట్టుకుందట. ఇక ఇదే విషయాన్ని నాగేశ్వరరావు తల్లి ఆయనకి కూడా చెప్పిందట.దాంతో నాగేశ్వరరావు కూడా తనకి పుట్టిన పిల్లల్లో ఇద్దరికీ నాగ సుశీల నాగార్జున అనే పేర్లు పెట్టుకున్నారు.
ఇక నాగేశ్వరరావు కూతురు కి నాగ సుశీల అని ఏఎన్ఆర్ భార్య పేరు పెట్టిందట కానీ నాగార్జున అనే పేరు పెట్టడం వెనక మరో సీక్రెట్ విషయాన్ని కూడా బయటపెట్టారు అక్కినేని నాగేశ్వరరావు. అదేంటంటే అప్పట్లో అంటే నాగార్జున పుట్టిన సమయంలో నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణం జరుగుతుంది. అది చాలా ఫేమస్ అలాగే నాకు నాగార్జున సాగర్ అంటే ఇష్టం. అందుకే నా కొడుకుకి నాగార్జున అనే పేరు నేనే స్వయంగా పెట్టుకున్నాను. అంటూ నా అక్కినేని నాగేశ్వరరావు ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు.
అలాగే నాగార్జున కూడా ఇదే సెంటిమెంట్ ని రిపీట్ చేస్తూ తనకి పుట్టిన మొదటి సంతానం అయినటువంటి కొడుకుకి నాగచైతన్య అని నామకరం చేశారు. అలా నాగేశ్వరరావు తల్లి మొదలుపెట్టిన సెంటిమెంట్ ని నాగార్జున కూడా కొనసాగించి తన కొడుకుకి నాగచైతన్య అని పెట్టారు. మరి ఇదే సెంటిమెంట్ ని నాగచైతన్య కూడా ఫాలో అయ్యి తనకు పుట్టబోయే పిల్లలకు నాగ అనే పేరు కలిసేలా నామకరణం చేస్తారా లేదా అనేది తెలియాలంటే ఇంకొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే