ఆ ఫ్లాప్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన వరుణ్ తేజ్.. ఈ టైమ్ లో అంత రిస్క్ అవసరమా..?

frame ఆ ఫ్లాప్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన వరుణ్ తేజ్.. ఈ టైమ్ లో అంత రిస్క్ అవసరమా..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో వరుణ్ తేజ్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో మంచి విజయాలను అందుకుంటూ కెరియర్ను జోష్ లో ముందుకు సాగించాడు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం వరుణ్ కి సరైన విజయాలు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కడం లేదు. వరుసగా ఈయన నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతూ వస్తున్నాయి. ప్రస్తుతం వరుణ్ తేజ్ "మట్కా" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఇకపోతే ఇప్పటికే వరుస అపజయాల్లో ఉన్న వరుణ్ తేజ్ మరో ఫ్లాప్ లో ఉన్న దర్శకుడికి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.

 అసలు విషయం లోకి వెళితే ... టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో మేర్లపాక గాంధీ ఒకరు. ఈయన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఎక్స్ ప్రెస్ రాజా అనే సినిమాకు దర్శకత్వం వహించి రెండో విజయాన్ని అందుకున్నాడు. కానీ ఆ తర్వాత ఈయన దర్శకత్వంలో రూపొందిన కృష్ణార్జున యుద్ధం , లైక్ షేర్ సబ్స్క్రయిబ్ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.

ఇకపోతే ఇలా వరుస అపజయాలతో డీలా పడిపోయి ఉన్న మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. దానితో అనేక మంది ఇప్పటికే వరుణ్ తేజ్ ఫ్లాపుల్లో ఉన్నాడు. మరో ఫ్లాప్ దర్శకుడికి అవకాశం ఇవ్వడం చాలా పెద్ద రిస్క్. కానీ రిస్క్ చేసి మరి ఈ దర్శకుడిని ఓకే చేశాడు అంటే కథలో దమ్ముండి ఉంటుంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vt

సంబంధిత వార్తలు: