చిన్న సినిమాతో స్టార్ హీరోలను టార్గెట్ చేసిన దిల్ రాజు.. జనక అయితే గనక విడుదల అప్పుడే..?

frame చిన్న సినిమాతో స్టార్ హీరోలను టార్గెట్ చేసిన దిల్ రాజు.. జనక అయితే గనక విడుదల అప్పుడే..?

Pulgam Srinivas
సుహాస్ హీరోగా తాజాగా జనక అయితే కనక అనే ఓ సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని దిల్ రాజు నిర్మించాడు. ఈ మూవీని ఈ రోజు అనగా సెప్టెంబర్ 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. ఈ సినిమాను సెప్టెంబర్ 7 వ తేదీన విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్ షో లను ఒక రోజు ముందుగానే ప్రదర్శించనున్నట్లు కూడా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ విడుదలకు అంతా సిద్ధం అనుకున్న సమయంలో ఇటు తెలంగాణ , అటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో కూడా భారీగా వర్షాలు కురుస్తూ ఉండడంతో అనేక ప్రాంతాల్లో వరదలు రావడం , రెండు రాష్ట్రాలలో కూడా పరిస్థితులు పెద్దగా బాగో లేకపోవడంతో ఈ సినిమా విడుదలను మేకర్స్ వాయిదా వేశారు.

ఇక ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు కానీ కొత్త విడుదల తేదీని మాత్రం చిత్ర బృందం వారు ఇప్పటివరకు ప్రకటించలేదు. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని అక్టోబర్ నెలలో విడుదల చేసే ఆలోచనలో దిల్ రాజు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే అక్టోబర్ నెలలో భారీ క్రేజ్ ఉన్న అనేక సినిమాలు విడుదల కానున్నాయి. అలా చాలా మంది స్టార్ హీరోలు నటించిన సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నా కూడా ఏ మాత్రం భయపడకుండా దిల్ రాజు ఈ మూవీ ని అక్టోబర్ నెలలోనే విడుదల చేయడానికి ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

ఇకపోతే ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు బాగుంటే ప్రేక్షకులను అత్యంత ఆకట్టుకుంటున్నాయి. పెద్ద హీరోలతో సరి సమాన స్థాయిలో కలెక్షన్లను రాబడుతున్నాయి. మరి ఈ మూవీ లో మంచి కంటెంట్ ఉంటే స్టార్ హీరోలకే ఈ మూవీ నుండి ప్రమాదం వచ్చే అవకాశం కూడా ఉంది. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Dr

సంబంధిత వార్తలు: