సమరసింహారెడ్డి స్టోరీని ఏ సినిమా ఇన్స్పిరేషన్ గా రాశారో తెలుసా..?

frame సమరసింహారెడ్డి స్టోరీని ఏ సినిమా ఇన్స్పిరేషన్ గా రాశారో తెలుసా..?

MADDIBOINA AJAY KUMAR
కొన్ని సంవత్సరాల క్రితం నందమూరి నటన సింహం బాలకృష్ణ హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో సమరసింహా రెడ్డి అనే ఫ్యాషన్ ఎంటర్టైనర్ మూవీ వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. తెలుగులో హీరో ఓరియంటెడ్ ఫ్యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా మొదట సమరసింహా రెడ్డి నే వచ్చింది. ఇక మొదట తెలుగులో వచ్చిన హీరో ఓరియంటెడ్ ఫ్యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కావడంతో ఈ సినిమాపై మొదటి నుండే ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన స్థాయిలో ఉండడంతో ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను చేసి ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ మూవీ కి అద్భుతమైన కథ రచయితగా పేరు తెచ్చుకున్న వారిలో ఒకరు అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ కథను అందించాడు.

విజయేంద్ర ప్రసాద్ ఒకానొక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ సమరసింహా రెడ్డి  మూవీ గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. విజయేంద్ర ప్రసాద్ "సమరసింహా రెడ్డి" మూవీ గురించి మాట్లాడుతూ ... బాలకృష్ణ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో రూపొందిన సమారసింహా రెడ్డి మూవీ కథను మరో బ్లాక్ బాస్టర్ సినిమా ఇన్స్పిరేషన్ గా రాసినట్లు చెప్పుకొచ్చాడు. కొన్ని సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా భాష అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ మూవీ ఇన్స్పిరేషన్ గానే సమరసింహా రెడ్డి కథను తయారు చేసినట్లు విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చేపకచ్చాడు. ఇకపోతే సమరసింహా రెడ్డి మూవీ కి మణిశర్మ సంగీతం అందించాడు. ఈయన అందించిన సంగీతం కూడా ఈ సినిమా విజయంలో కీలక పాత్రను పోషించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: