అదన్నారు.. ఇదన్నారు.. సాహో దరిదాపుల్లోకి కూడా రాలేకపోయినా ది గోట్..?

frame అదన్నారు.. ఇదన్నారు.. సాహో దరిదాపుల్లోకి కూడా రాలేకపోయినా ది గోట్..?

Pulgam Srinivas
తలపతి విజయ్ తాజాగా ది గోట్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించగా ... వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా సెప్టెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదల అయింది. ఇకపోతే మొదటి నుండి కూడా తమిళ ప్రేక్షకులు ఈ సినిమా అద్భుతమైన స్థాయి విజయాన్ని అందుకుంటుంది , మొదటి రోజు భారీ కలక్షన్లను వసూలు చేస్తుంది అనే ఆశా భావాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. కానీ ఈ సినిమా మాత్రం మొదటి రోజు భారీ ఎత్తున కలక్షన్లను వసూలు చేయలేక పోయింది.

ఈ మూవీ మంచి కలెక్షన్లన్ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రాబట్టిన ప్రభాస్ చాలా సంవత్సరాల క్రితం హీరోగా నటించి బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయిని విజయాన్ని అందుకోలేకపోయిన సాహో సినిమా మొదటి రోజు కలెక్షన్లను కూడా ది గోట్ సినిమా క్రాస్ చేయలేకపోయింది. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం ప్రభాస్ హీరో గా శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా సుజిత్ దర్శకత్వంలో సాహో అనే మూవీ రూపొందిన విషయం మనకు అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మొదటి రోజే కాస్త నెగటివ్ తక్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర తెచ్చుకుంది.

అయిన కూడా ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 126 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. సెప్టెంబర్ 5 వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదల అయినటువంటి ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 104.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లను మాత్రమే వసూలు చేసి సాహో మూవీ ని కూడా బీట్ చేయలేక పోయింది. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఏ  స్థాయి కలెక్షన్లను వసులు చేసి ఏ  రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: