ఆ సాంగ్ విషయంలో రాజమౌళిని ఫాలో అవుతున్న కొరటాల.. సక్సెస్ అయ్యేనా..?

frame ఆ సాంగ్ విషయంలో రాజమౌళిని ఫాలో అవుతున్న కొరటాల.. సక్సెస్ అయ్యేనా..?

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మొదటి భాగంలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుండగా అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు వరుసగా ఈ సినిమాకు సంబంధించిన పాటలను విడుదల చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ నుండి మేకర్స్ మూడు పాటలను విడుదల చేయగా ఆ మూడు పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

కొన్ని రోజుల క్రితం ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి దావూదీ అంటూ సాగే పాటను విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సాంగ్ అద్భుతంగా ఉండడంతో విడుదల అయిన తక్కువ సమయంలోనే ఈ సాంగ్ కి ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభిస్తుంది. తాజాగా ఈ పాటకు సంబంధించిన ఓ క్రేజ్ న్యూస్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఈ పాట సినిమా నడుస్తున్నప్పుడు కథతో అనుగుణంగా రాదట. దానితో ఈ సాంగ్ ను సినిమా మొత్తం పూర్తి అయ్యాక రోలింగ్ టైటిల్స్ లో వేయనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే కొన్ని రోజుల క్రితం రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్ గా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కూడా ఎత్తర జెండా అనే పాటను సినిమా మొత్తం పూర్తి అయ్యాక రోలింగ్ టైటిల్స్ లో వేశారు.

అది సూపర్ సక్సెస్ అయింది. మరి అదే మాదిరి దేవర మూవీలోని దావూదీ సాంగ్ కూడా సక్సెస్ అవుతుందేమో చూడాలి. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: