మోడలింగ్ రంగం నుండి
సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మలలో మీనాక్షి
చౌదరి ఒకరు. ఈమె ఇచట వాహనములు నిలపరాదు అనే సినిమాతో తెలుగు సినీ
పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోకపోయిన ఈ
మూవీ ద్వారా మీనాక్షి కి మాత్రం మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత కిలాడి సినిమాలో హీరోయిన్గా నటించిన ఈమె ఆ
మూవీ లో అందాలను విపరీతంగా ఆరబోయడంతో ఈ
మూవీ తర్వాత నుండి మీనాక్షి కి తెలుగులో అవకాశాలు వరుసగా వస్తున్నాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఏకంగా నాలుగు సినిమాలు ఉన్నాయి.
అందులో కనీసం రెండు , మూడు సినిమాలు మంచి విజయాలను సాధించిన కూడా ఈమె తెలుగు సినీ పరిశ్రమలో టాప్
హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ
బ్యూటీ మెగా
ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న మట్కా అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఈ
మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ
మూవీ తో పాటు
టాలీవుడ్ యువ నటుడు
విశ్వక్ సేన్ హీరోగా రూపొందుతున్న మెకానిక్ రాఖి అనే సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే
దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందుతున్న లక్కీ
భాస్కర్ మూవీ లో కూడా ఈ
బ్యూటీ హీరోయిన్గా నటిస్తోంది.
మెగాస్టార్
చిరంజీవి హీరోగా రూపొందుతున్న విశ్వంభర
మూవీ లో ఈ నటి ఓ కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఇలా ఈ ముద్దుగుమ్మ చేతిలో ప్రస్తుతం ఈ నాలుగు క్రేజీ సినిమాలు ఉన్నాయి. ఇందులో కనీసం రెండు , మూడు సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్న కూడా మీనాక్షి
టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్
హీరోయిన్ స్థాయికి వెళ్లే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. మరి ఈ సినిమాలతో ఈ ముద్దుగుమ్మకు ఎలాంటి విజయాలు దక్కుతాయో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.