రామ్ చరణ్ హీరోయిన్ ని వెంటాడుతున్న బ్యాడ్ లక్.. ఈసారి కూడా అలా..!?

frame రామ్ చరణ్ హీరోయిన్ ని వెంటాడుతున్న బ్యాడ్ లక్.. ఈసారి కూడా అలా..!?

Anilkumar
స్టార్ హీరోయిన్ కి అలా అద్వానీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది ఈ బ్యూటీ. అయితే ప్రస్తుతం  చెర్రీతో చేస్తున్న గేమ్‌ చేంజర్‌తో మాత్రమే కాదు, తారక్‌ తో చేస్తున్న వార్‌2 తోనూ ట్రెండింగ్‌ లోకి వచ్చేశారు కియారా అద్వానీ. హృతిక్‌, తారక్‌ నటిస్తున్న వార్‌2 లో కమాండో ఫైటర్‌ గా నటిస్తున్నారు కియారా. ఇక ఈ మూవీ కోసం స్పెషల్‌ గా మార్షల్‌ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నారు ఈ బ్యూటీ. వార్‌2 లో కమాండో ఫైట్‌ తో కియారా ఎంట్రీ సీక్వెన్స్ ప్లాన్‌ చేశారట మేకర్స్. ఈ సీక్వెన్స్ ఆమె కెరీర్‌ లో అసలైన యాక్షన్‌ షురూ చేస్తుందని అంటున్నారు యూనిట్‌

 మెంబర్స్. దాదాపు నాలుగు రోజుల పాటు ముంబైలో ఈ సీక్వెన్స్ తెరకెక్కించారు. ఆల్రెడీ యాక్షన్‌ జోనర్‌లో ప్రూవ్‌ చేసుకున్నారు దీపిక, నయన్‌, ఆలియా అండ్‌ అదర్స్. ఇప్పుడు ఈ జోనర్‌లో కూడా కియారా తనను తాను ప్రూవ్‌ చేసుకుంటే, ప్యాన్‌ ఇండియా లెవల్లో ఆల్‌ రౌండర్స్ అని పేరు తెచ్చుకున్న నాయికల్లో కియారా నేమ్‌ మరింత స్ట్రాంగ్‌గా ఉంటుందన్నమాట. అయితే కియారా అద్వానీ ప్రస్తుతం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా వర్సస్ సినిమాలు చేస్తుంది. అందులో భాగంగానే రణ్‌వీర్ సింగ్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించిన డాన్ 3 మూవీ తాజాగా పోస్ట్ పోన్ అయ్యింది. నిర్మాణ షెడ్యూల్‌ మరింత ఆలస్యం

 కాబోతోంది. మొదట్లో ఆగస్ట్ 2023లో చిత్రీకరణ ప్రారంభించాలని భావించగా, సినిమా షూటింగ్ జనవరి 2025కి వాయిదా పడింది. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం చిత్ర నిర్మాత ఫర్హాన్ అక్తర్ తన రాబోయే చిత్రం 120 బహదూర్‌లో ఉన్న కమిట్‌మెంట్‌ల కారణంగా ఈ షెడ్యూల్ మరింత ఆలస్యం జరబోతోందని సమాచారం. మొత్తానికి దాదాపు నాలుగు నెలల పాటు ఈ సినిమా వాయిదా పడిందని అంటున్నారు. 120 బహదూర్‌లో మేజర్ షైతాన్ సింగ్ PVC పాత్రను పోషించబోతున్న అక్తర్ డాన్ 3 కంటే ఆ ప్రాజెక్ట్‌కు ప్రాధాన్యత ఇచ్చాడు. ఆయన ముందుగా ఒప్పుకున్న ఈ మూవీ షూట్ కు చాలా నెలలు పడుతుంది. కాబట్టి డాన్ 3 షెడ్యూల్ దాదాపు నాలుగు నెలల పాటు వాయిదా వేశారని అంటున్నారు. 2025 మే-జూన్ లో డాన్ 3 షూటింగ్ స్టార్ట్ కానుందని టాక్...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: